
మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్పనిసరిగా థర్డ్‌పార్టీ బీమా పాలసీ ఉండాలి. కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏ) 2024లో దేశంలో 40 కోట్ల వాహనాలు ఉన్నాయని అంచనా వేస్తే అందులో దాదాపు 50 శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉందని తెలుస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.2,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రెండోసారి పట్టుబడితే రూ.4,000 వరకు జరిమానా ఉంటుంది.
వాహన సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసే ప్రతిపాదనలను కూడా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. వాహన సేవలను బీమా కవరేజీతో లింక్ చేసే అవకాశాలున్నాయి. ఈ కొత్త నిబంధనలను కచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ వర్గాలు చెప్తున్నాయి.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ