
రాజన్న సిరిసిరి జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తుతెలియని ముస్లిం వ్యక్తి గుడి ముందు నమాజ్ చేసి పాదరక్షలతో ఆలయాన్ని అపవిత్రం చేసి అక్కడ ఉన్న అర్చకులపై, సిబ్బందిపై హత్యాయత్నం చేసిన సదరు ముస్లిం వ్యక్తిపై హత్యాయత్నం కేసు కింద కేసు నమోదు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
ఈ విషయమై పరిషత్ నాయకులు గురువారం వేములవాడ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో గత కొద్ది రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరీ ముఖ్యంగా వేములవాడ పరిసర గ్రామాలలో హిందూ ఆలయాలలో హుండీ దొంగతనాలు, అన్యమత ప్రచారాలు తరచుగా జరుగుతూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే ఆలయాలకు రక్షణ కల్పించాలని, ఆలయంలో పనిచేసే అర్చకులకు, సిబ్బందికి రక్షణ కల్పించాలని, హిందువుల మనోభావాలను కాపాడాలని వారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసినవారిలో పరిషత్ నాయకులూ గడప కిషోర్ రావు ,నాగుల రాములు గౌరిశెట్టి శ్రీనివాస్, కొక్కు గోపాలకృష్ణ ,సంతోష్, వికాస్, శ్రీనివాస్ ఉన్నారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు