
* అరుణాచల్ ప్రదేశ్‌పై సమాధానం దాటవేత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో అగ్రరాజ్యం అమెరికాకు తిరుగులేదన్న తరుణంలో ఒక్కసారి తెరపైకి వచ్చిన డీప్‌సీక్ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. చైనాకు చెందిన ఈ స్టార్టప్ సంస్థ ఇప్పుడు అమెరికా టెక్‌స్టాక్‌ను కుదిపేసింది. ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమినీ, మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన అజురా, కోపైలట్‌ను తోసిరాజని ‘డీప్‌సీక్’ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ‘డీప్‌సీక్ ఆర్1’ టూల్‌ని ఉద్దేశిస్తూ.. అమెరికన్ టెక్ కంపెనీలకు ఇదో మేల్కొలుపు అంటూ వ్యాఖ్యానించారంటే ఇది ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తున్నదో అర్థంచేసుకోవచ్చు. చైనా లోని హాంగ్జౌకు చెందిన ఏఐ రీసెర్చి సంస్థ డీప్‌సిక్ . దీన్ని 2023లో లియాంగ్ వెన్‌ఫింగ్ ప్రారంభించారు.
‘డీప్‌సీక్ ఆర్1’ అనేది చాట్‌జీపీటీ లాంటి ఏఐ ఆధారిత చాట్‌బాట్. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇవ్వడానికి సాయపడుతుంది. చాట్‌జీపీటీ లాగే ఆర్1 మోడల్‌పై ఇది పనిచేస్తుంది. అంటే 670 బిలియన్ పారామీటర్లు కలిగి ఉన్న అతిపెద్ద లాంగ్వేజ్, డాటాను ఇది నిక్షిప్తం చేసుకొని సేవలు అందిస్తుందన్న మాట. ఏ ప్రశ్న అడిగినప్పటికీ సమాధానమివ్వగల సామర్థ్యం దీని సొంతం.
తాజాగా ఈ సంస్థ ఆర్1 పేరిట ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం. పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్‌ను ఇలా పూర్తిగా ఉచితంగా అందిస్తుండడం విశేషం. ఓపెన్ ఏఐ, క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. తాజా ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్‌ఏఐ , గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తుండగా, డీప్‌సీక్ మాత్రం కేవలం 6 మిలియన్ డాలర్లతో లేటెస్ట్ ఏఐ మోడళ్లను రూపొందించడం గమనార్హం. దీంతో పోలిస్టే ఇతర కంపెనీలు దాదాపు 30 రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాయి.
దీన్ని వాడిన వారు ఇతర ఏఐ మోడళ్లతో పోల్చి చూస్తూ పనితీరు బాగుంటుందని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో డీప్‌సీక్ ఒక్కసారి ప్రాచుర్యం లోకి వచ్చింది. సోషల్ మీడియా లోనే కాదు.. అటు యాపిల్ యాప్ స్టోర్ లోనూ డీప్‌సీక్ దూసుకెళ్తోంది. అమెరికా, బ్రిటన్, చైనాలో టాప్ ఫ్రీ అప్లికేషన్ జాబితాలో ఓపెన్ ఏఐని దాటేసింది.
ఎన్విడియాతో పోలిస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్ తోనే తాము ఏఐ మోడల్స్‌ను రూపొందించామని కంపెనీ పేర్కొనడం గమనార్హం. దీంతో ఫ్రీ మార్కెట్ ట్రేడ్‌లో ఎన్విడియా షేరు 14 శాతం, మైక్రోసాఫ్ట్ 7 శాతం, మెటా 5 శాతం చొప్పున నష్టాల్లో పతనమయ్యాయి. ఏఐ స్ఫుత్నిక్ మూమెంట్‌గా అభివర్ణించే దీన్ని చాట్ .డీప్‌సీక్. కామ్ వెబ్‌సైట్ లోకి వెళ్లి మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి ఈ ఏఐ చాట్ బాట్‌ను వినియోగించవచ్చు.
వెంటనే డాల్ఫిన్ లోగోతో కూడిన చాట్‌పేజీ ఓపెన్ అవుతుంది. వెబ్‌పేజీ, యాప్, ఏపీఐ రూపంలో అందుబాటులో ఉంది. ఇంటర్‌ఫేస్ పరంగా అచ్చం చాట్‌జీపీటీని పోలి ఉంటుంది. తెలుగులోనూ చాట్ చేయొచ్చు.
చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్‌పై టెక్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా, తక్కువ ఖర్చుతోనే ఏఐ మోడల్‌ను అందుబాటులోకి ఈ సంస్థ తెచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా భారత దేశంలోని ఓ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌పై అడిగిన ప్రశ్నకు ఈ డీప్‌సీక్ చాట్‌బాట్ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది.
ఆర్1 పేరుతో ఏఐ మోడల్‌ను డీప్‌సీక్ ఆవిష్కరించింది. దీనిలో రిజిస్టర్ చేసుకున్న ఓ యూజర్ , ‘అరుణాచల్ ప్రదేశ్ భారత్ లోని ఓ రాష్ట్రం ’ అని టైప్ చేశారు. దీనికి చాట్‌బాట్ స్పందిస్తూ ‘ఇది నా పరిధి దాటిన అంశం… వేరే ఏదైనా చర్చిద్దాం’ అని సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే సదరు యూజర్ ‘ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పండి’ అని అడగ్గా చాట్‌బాట్ మళ్లీ అదే సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్