ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్, దుబాయ్ లలో జరగబోయే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక కొత్త వివాదం ఉత్పన్నమైంది. టీమిండియా ప్లేయర్స్ జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు ముద్ర వేసే విషయమై బీసీసీఐ- పీసీబీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఆటగాళ్ల జెర్సీ పై ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆతిథ్య దేశం పేరు కచ్చితంగా ఉండాలి.
కానీ పాక్ పేరును ముద్రించడానికి, బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా వివాదస్పదమైన ఈ అంశంలోకి ఐసీసీ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐకి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపించినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అంతకుముందు పీసీబీ మాట్లాడుత ”బీసీసీఐ క్రికెట్లోకి రాజకీయాలను తెస్తోంది. దీని వల్ల ఆటకు నష్టం కలుగుతుంది. మొదటగా భారత జట్టును పాకిస్థాన్‌కు పంపడానికి తిరస్కరించారు. ట్రోఫీ ప్రారంభ వేడుకలకు కెప్టెన్‌ను పంపించడం లేదు. ఇప్పుడేమో టీమిండియా జెర్సీలపై ఆతిథ్య దేశం (పాకిస్థాన్) పేరును ముద్రించడం లేదు” అని విమర్శించింది.
”జెర్సీపై టోర్నమెంట్ లోగో ముద్ర వేయడం ప్రతీ జట్టు బాధ్యత. ప్రతి జట్టు ఈ నిబంధనను పాటించాలి. కాబట్టి టీమిండియా జెర్సీపై, ప్లేయర్స్ కిట్ పై ఆతిథ్య దేశం పేరుతో ఛాంపియన్స్ ట్రోఫీ లోగో ఉండాలి. ఒకవేళ టీమిండియా దీనిని పాటించకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం.” అని ఓ ఐసీసీ అధికారి చెప్పినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇ
క ఈ జెర్సీ వివాదంపై ఓ బీసీసీఐ అధికారి కూడా స్పందించారు. ఇదేం పెద్ద విషయం కాదని, రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భారత్ తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడుతోందని, కాబట్టి జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
”జెర్సీపై పేరు కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. అయినా మేం దుబాయ్ లో ఆడుతున్నాం. పాకిస్థాన్ లో ఆడట్లేదు. కాబట్టి జెర్సీపై వాళ్ల పేరు ఉండాలనేం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ సందర్భంగా ఇతర దేశాల్లో పోడియంపై పాకిస్థాన్ పేరును ప్రదర్శించారు. కానీ ఇండియాలో మాత్రం అలా చేయలేదు. పోడియంపై పాకిస్థాన్ పేరును ప్రదర్శించలేదు. కాబట్టి ఐసీసీ రూల్స్ ప్రకారం టీమిండియా జెర్సీపై కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ లోగోను మాత్రమే ముద్రిస్తాం.” అని చెప్పారు.

More Stories
కారు బాంబు దాడిలో రష్యన్ జనరల్ మృతి
బంగ్లాదేశ్‌లో మరో విద్యార్థి నేతపై కాల్పులు
భారత్ తో బంగ్లా సంబంధాలు దెబ్బతినే అవకాశం!