
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కెటిఆర్‌కి రైతులు గుర్తుకు రాలేదని, అధికారం పోయాక రైతులపై ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నారని మెదక్ ఎంపి రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలోని బిజెపి జిల్లా కార్యాలయంలో సోమవారం పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కెటిఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న బిఆర్ఎస్ ఎంఎల్‌సి కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు వేశారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయని, చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోందని, మంచి డాక్టర్‌కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని హితవు చెప్పారు.
రాజ్యాంగ ప్రతుల్ని చింపిన ల్ గాధీ రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ అంబేద్కర్‌ను గౌరవించలేదని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాజజ్యాంగబద్ధంగా ఎన్నిక కాకముందే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సవరణలు చేసి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్‌కి అవమానం జరిగిందని, కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ని గౌరవించలేదని, కేవలం అంబేద్కర్ జయంతి, వర్ధంతి తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని, గాంధీ, నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారని పేర్కొన్నారు.
ఆనాడు ప్రధాని మన్మోహన్ని కాదని యుపిఎ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. రాజ్యాంగేతర ప్రధానిగా వ్యవహరించిన యుపిఎ ఛైర్పరసన్ సోనియాగాంధీ తనకు అనుకూలంగా రాజ్యాంగానికి సవరణలు చేసి మార్చుకున్నారని బిజెపి ఎంపీ ధ్వజమెత్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అటూ రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్‌కు పేదలు గుర్తుకు వస్తారని పేర్కొంటూ ఆనాడు అధికారంలో ఉన్న బిసిలను, పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఐదు తరాలుగా భారత రత్న అవార్డులను తీసుకుంటున్నారని, అంబేద్కర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అవలక్షణాలు కలిగిన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను ఓడించింది కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలేనని ఆరోపించారు. సుప్రీంకోర్టు ముస్లిం మహిళలకు విడాకులు తీసుకుంటే భరణం చెల్లించాలని చెబితే భరణం ఇవ్వకుండా రాజ్యాంగాన్నే మార్చిన ఘనత కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారరు.
More Stories
`జై శ్రీరామ్’ నినాదంతో ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి!
హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసులో 24 గంటలు స్పీడ్ పోస్ట్
ఇప్పుడు 3 జిల్లాలకే నక్సలిజం పరిమితం