ప్రపంచ వాతావరణ మార్పుల కారణంగా పిల్లలకు సంబంధించిన సేవలు బలహీనపడుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా పిల్లల ఆరోగ్య సంరక్షణ, విద్య, మానసిక శ్రేయస్సుకు మద్దతు ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రపంచ వాతావరణం ప్రకారం పిల్లల ప్రతిస్పందించే చొరవలకు కేవలం 2.4% మాత్రమే కేటాయించబడుతోంది. దీంతో పిల్లలకు అవసరమైన సేవలకు ప్రాధాన్యత లేకుండా పోతుంది.
డిజిటల్ అసమానత ప్రపంచంలో పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాలలో 15-24 ఏళ్ల వయస్సు కలిగిన యువతకి అధిక ఆదాయ దేశాలలో ఇంటర్నెట్ సదుపాయం ఉంది. కానీ ఆఫ్రికాలో 53% మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. అలాగే బాలికలు, వైకల్యాలున్న పిల్లలు ఈ డిజిటల్ అసమానతను మరింత అనుభవిస్తున్నారు.
ఈ నివేదిక ప్రపంచానికి, ప్రభుత్వాలకు సూచన లాటిందని చెప్పవచ్చు. ఎందుకంటే బలమైన సామాజిక వ్యవస్థలను నిర్మించడం, పిల్లల హక్కులను గౌరవిస్తూ, సమగ్ర, జవాబుదారీ విధానాలను తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలకు నివేదిక సూచించింది. దీంతో పాటుగా డిజిటల్ సేవల్లో పిల్లల హక్కులను మరింత పటిష్టంగా ఇంటిగ్రేట్ చేయాలని కోరింది.
భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. 163 దేశాలలో భారతదేశం 26వ స్థానంలో ఉంది. అంటే తీవ్ర వేడి, వరదలు, వాయు కాలుష్యం వంటి ప్రమాదాలను పిల్లలు ఎదుర్కొంటున్నారు. 2000ల తర్వాత వేడి గాలులకు గురైన పిల్లల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగింది. అలాగే బాల కార్మికుల సమస్య కూడా అనేక ప్రాంతాలలో పెరుగుతోంది. భారతదేశంలో 259.6 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 10.1 మిలియన్ల మంది చిన్న పరిశ్రమ, వసయం, ఇతర పనులలో కార్మికులుగా పనిచేస్తున్నారు.

More Stories
26/11 ఉగ్రదాడి తరహా 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు
ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ!
అమెరికాలో ప్రతిభావంతులు లేరు.. విదేశీ ప్రతిభ అవసరమే