కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయిల్ సుముఖత

కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయిల్ సుముఖత
గాజా స్ట్రిప్‌లో బందీలను తిరిగి ఇచ్చే ఒప్పందం కుదిరిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎట్టకేలకు ప్రకటించడంతో ఈ ఒప్పందంపై నెలకొన్న సంశయాలు తొలగిపోయాయి. గాజాలో కాల్పుల విరమణ, పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి ప్రతిగా బందీలను విడిపించడానికి చర్చలలో చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తాయని నెతన్యాహు కార్యాలయం చెప్పిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 
 
శుక్రవారం తన భద్రతా మంత్రివర్గాన్ని సమావేశపరిచి, ఆపై ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించనున్నట్లు నెతన్యాహు చెప్పారు. అయితే, హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని, తుది వివరాలను రూపొందిస్తున్నామని బుధవారం ఆలస్యంగా ఆయన చెప్పడంతో ఒప్పందం అమలుపై నీలిమేఘాలు ఆవరించి. 
 
అమెరికా,  ఖతార్ ఈ ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత నెతన్యాహు ప్రకటన తొలుత వచ్చింది. ఈ ఒప్పందం గాజాలో 15 నెలల వినాశకరమైన యుద్ధాన్ని నిలిపివేసి, డజన్ల కొద్దీ బందీలు ఇంటికి వెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. ఈ వివాదం మధ్యప్రాచ్యాన్ని అస్థిరపరిచింది.  ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. 
 
ఒప్పందం ప్రకటించినప్పుడు గాజాలో ఆనందోత్సాహాలతో కూడిన పాలస్తీనియన్లు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి, కార్ హారన్‌లను మోగిస్తూ, ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్- యుద్ధం గాజాలో 46,000 మందికి పైగా పాలస్తీనియన్లను చంపిందని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. మరణాలలో సగం కంటే ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలే అని చెబుతున్నారు. 
 
గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం అక్టోబర్ 7, 2023న ప్రారంభమైంది, ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాదాపు 1,200 మందిని చంపి, దాదాపు 250 మందిని అపహరించారు. గాజాలో ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న  100 మంది బందీలలో మూడోవంతు మంది చనిపోయారని భావిస్తున్నారు.
 
ఆదివారం నుంచి అమల్లోకి రానున్న ఈ ఒప్పందంలో కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించడం, దీని ఆమోదం కోసం గురువారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం జరగక పోవడంతో ఒప్పందం పట్ల ఇజ్రాయిల్ వైఖరిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

గాజా శాంతి ఒప్పందాన్ని భారత్, రష్యా, చైనా, బ్రిటన్‌ సహా పలు దేశాలు స్వాగతించాయి.  గాజాకు 123 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ఐరోపా యూనియన్‌ ప్రకటించింది. అయితే ఒప్పందం కుదిరిందన్న వార్త వెలువడినా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ాత్రం ఆగలేదు. ుధవారం రాత్రి నుంచి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.