శ్రీహ‌రికోట‌లో మూడ‌వ లాంచ్‌ప్యాడ్

శ్రీహ‌రికోట‌లో మూడ‌వ లాంచ్‌ప్యాడ్

* 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం శ్రీహ‌రికోటలో మూడ‌వ లాంచ్‌ప్యాడ్‌ను నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది.మూడ‌వ లాంచ్‌ప్యాడ్ ద్వారా నెక్ట్స్ జ‌న‌రేష‌న్ లాంచ్ వెహికిల్స్‌(ఎన్జీఎల్వీ)ను ప్ర‌యోగించ‌నున్నారు. ఎన్జీఎల్వీ రాకెట్లు భారీ శాటిలైట్ల‌ను క‌క్ష్య‌లోకి మోసుకెళ్ల‌గ‌ల‌వని ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు.
 
నాలుగేళ్ల‌లో లాంచ్‌ప్యాడ్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. సుమారు 3985 కోట్ల ఖ‌ర్చుతో ఆ కేంద్రాన్ని నిర్మించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రోద‌సి ప్ర‌యోగాల‌కు చెందిన మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో ఇదొక ముఖ్య‌మైన మైలురాయిగా మార‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మొద‌టి, రెండ‌వ లాంచ్‌ప్యాడ్ల‌తో పోితే  మూడ‌వ లాంచ్‌ప్యాడ అధిక సామ‌ర్థ్యంతో ఉండ‌నున్న‌ట్లు చెప్పారు.

భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల నెక్స్ట్ జనరేషన్​ లాంచ్ వెహికిల్-ఎన్​జీఎల్​వీ ప్రయోగాలకు వీలు కల్పించే కొత్త లాంచ్​ప్యాడ్​ నిర్మాణాన్ని రోదసీ పరిశోధన రంగానికి అవసరమయ్యే మౌలిక వసతుల అభివృద్ధిలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం భారత్ త్వరలో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు షార్​లో కొత్తగా నిర్మించబోయే లాంచ్​ప్యాడ్​ ఉపకరించనుంది. ఎన్​జీఎల్​వీ ప్రయోగాలు మాత్రమే కాక సెమీ క్రయోజనిక్ స్టేజ్​తో కూడిన ఎల్​వీఎమ్​3 ప్రయోగాలకూ వేదిక కానుంది.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనున్నాయి.
 
ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. వేతనం సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కమిషన్‌ చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించనున్నది. 
 
ఉద్యోగులు, పెన్షనర్లు, ట్రేడ్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్‌ సమావేశమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.