
కేరళలోని వయనాడ్‌లో గతేడాది సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై పినరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో విపత్తులో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని, పరిహారం అందించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడింది. గల్లంతైన వ్యక్తుల జాబితాను పరిశీలించేందుకు రెవెన్యూ శాఖ అధికారులతో సహా స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
ఈ కమిటీ విపత్తులో తప్పిపోయిన వారి జాబితాను తయారు చేసి పరిశీలన కోసం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీకి సమర్పిస్తుంది. డీడీఎమ్‌ఏ ఆ జాబితాను పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపితే.. అక్కడి నుంచి ఆ జాబితా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ జాబితాలో పేర్లు ఉన్నవారిని ప్రభుత్వం మృతులుగా ప్రకటించి.. వారి బంధువులకు పరిహారం అందిస్తుంది.
కాగా, గతేడాది జులై 30న వయనాడ్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించిన విషయం తెలిసింద. భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘటనలో సుమారు 263 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. మరో 35 మంది మిస్సయ్యారు.
More Stories
శబరిమలద్వారపాలక విగ్రహాలపై బంగారు-రాగి తాపడాలు
అహ్మదాబాద్ లో 2030 కామన్వెల్త్ గేమ్స్
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీంకోర్టు అనుమతి