
హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. ‘నమస్కారం ముద్దు – హ్యాండ్‌షేక్ వద్దు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. షేక్ హ్యాండ్స్ కారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.
సీజనల్ వ్యాధులు తరుచుగా పిల్లలు, వృద్ధుల్లో అధికంగా వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభు కుమార్ తెలిపారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
కాబట్టి వీలైనంత వరకు ఈ వైరస్ నివారణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వైరస్ సోకిన వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చల్లని గాలులకు దూరంగా ఉండడంతో పాటు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
– ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి.
– తరుచుగా సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
– జన సమూహాలకు దూరంగా ఉండాలి.. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
– రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి.
– వీలైనంత వరకు ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– జలువు, దగ్గు విపరీతంగా ఉంటే.. తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?