చైనా, నేపాల్‌లో భారీ భూకంపం.. ఉత్తర భారతంలోనూ ప్రకంపణలు

చైనా, నేపాల్‌లో భారీ భూకంపం.. ఉత్తర భారతంలోనూ ప్రకంపణలు
* టిబెట్ ప్రాంతంలో చైనాలో 53 మంది మృతి
పశ్చిమ చైనాలోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి నేపాల్ సమీపంలోని పశ్చిమ చైనాలో టిబెట్ ప్రాంతంలో కనీసం 53 మంది మృతి చెందారని, 62 మంది గాయాలకు గురయ్యారని  ఏకంగా 9 మంది వరకు మృతి చెందారని చైనా ఎమెర్జెన్సీ మేనేజ్​మెంట్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
నేపాల్​ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ రీజియన్​లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే చైనా భూకంప పర్యవేక్షణ సంస్థ మాత్రం రిక్టర్ స్కేల్​పై భూకంప తీవ్రత 6.8గా నమోదైందని పేర్కొంది. హిమాలయ దేశం నేపాల్‌ను మరోసారి భూకంపం వణికించింది.
మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ తర్వాత స్వల్ప తీవ్రతతో మరో రెండు సార్లు ప్రకంపణలు వచ్చాయి. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఖాట్మండ్ తోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.మంగళవారం ఉదయం 6.35 గంటలకు నేపాల్‌- టిబెట్‌ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో భూమి కపించింది.
టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. అనంతరం షిజాంగ్‌ ప్రాంతంలోనే మరో రెండుసార్లు భూమి కంపించిందని, వాటి తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.7, 4.9గా నమోదయిందని వెల్లడించింది. భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. ఢిల్లీ ఎన్సీఆర్‌, బెంగాల్‌, బీహార్‌, అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపణలు సంభవించాయి. బీహార్‌లో ఆందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఇక చైనా, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.

కాగా, టిబెట్‌లోని షిగెట్స్‌ పట్టణంలో గత ఐదేండ్లలో 29 సార్లు భూకంపం వచ్చింది. ఇవన్నీ 3 లేదా అంతకంటే ఎక్కవ తీవ్రతతో కూడుకున్నవని, 200 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే మంగళవారం ఉదయం సంభవించిన భూకంపంతో పోల్చితే ఇవన్నీ చాలా చిన్నవని తెలిపారు. చైనాలో భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూప్రకంపనలతో జనం భయాందోళనకు గురి అయ్యారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు రోడ్లపైకి పరిగెత్తారు.