సంచార తెగల్లోని 4 కులాల పేర్ల మార్పుకై సుముఖత

సంచార తెగల్లోని 4 కులాల పేర్ల మార్పుకై సుముఖత

సంచార తెగల్లోని చాలా కులాల పేర్లను ఎన్నో ఏళ్లుగా  మన సమాజం తిట్టు పదాలుగా ఉపయోగిస్తూ ఉండడంతో    ఎన్నో అవమానాలకులోనై  ఈ కులాలు ప్రభుత్వాన్ని తమ కులాల పేర్లు మార్చాలని లేదా బ్రాకెట్లో ఇంకోక పర్యాయపదo చేర్చాలని  అభ్యర్ధిస్తూనే ఉంది

దీనికి మద్దతుగా విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి రాష్ట్ర కమిటీ నాలుగు కులాల పేర్ల మార్పుకై విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. వివిధ వేదికల మీద ఆయా కులాల అభ్యర్ధణలకు అనుకూలంగా స్పందిస్తూ తెలంగాణ బిసి కమీషన్ కి వినతి పాత్రలను సమర్పిస్తూ వచ్చింది. వీరి అభ్యర్థనలను మన్నిస్తూ సంచార తెగల్లోని ఆయన కులాల పేర్ల మార్పు దిశలో పర్యాయపదాలు సూచిస్తూ  ప్రతిపాదనలను బిసి కమిషన్ సిద్ధం చేసింది.
 
ఇప్పటికే ఈ విషయమై కుల సంఘాల అభిప్రాయాలను స్వీకరించింది. బిసి ఏ గ్రూప్ లోని దొమ్మర ను గాడ వంశీయగా పర్యాయపదంగా సూచించింది.  వంశరాజ్/పిచ్చగుంట్ల లో పిచ్చగుంట్ల పేరు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా బుడబుక్కలకు  అరే క్షత్రియ జోషి/శివ క్షత్రియ/రామజోషి పేర్లు, రజక (చాకలి/పన్నర్)లకు పన్నార్ పదం తొలగించి దోబీని పర్యాయపదంగా సూచించింది. వీర ముష్టి (నెత్తికొట్టాల), వీరభద్రీయ కులాలకు వీరభద్రీయ పేరును నిర్ధారించారు.
 
ఈ పేర్ల మార్పులో అభ్యంతరాలు ఏవైనా ఉంటె ఎవరైనా ఈ నెల 18లోగా బిసి కమిషన్ లో తెలపాలని కార్యదర్శి బాల మాయాదేవి తెలిపారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన బిసి కమిషన్ కు విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి  ధన్యవాదాలు తెలిపింది.