
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే నివసిస్తుంటారు. దీంతో పట్టణం కూడా బాగా విస్తరిస్తోంది. మరోవైపు ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రావడం లేదు. నగర రోడ్లలో ప్రయాణం నరకయాతంగా మారిపోయింది. ఇక పీక్స్ అవర్స్, హాలిడేస్‌లో ట్రాఫిక్‌ను తప్పించుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది.
ఇక ఈ జాబితాలో బెంగళూరు తర్వాత పూణె రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరానికి 27 నిమిషాల 50 సెకన్ల సమయం పడుతోంది. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌లోని మనీలా (27 నిమిషాల 20 సెకన్లు) , తైవాన్‌లోని తైచుంగ్ (26 నిమిషాల 50 సెకన్లు), జపాన్‌లోని సప్పోరో (26 నిమిషాల 50 సెకన్లు), తైవాన్‌లోని కావొచ్సిఉంగ్ సిటీ (26 నిమిషాలు), జపాన్‌లోని నగోయా (24 నిమిషాల 20 సెకన్లు), ఇండొనేషియాలోని జకార్తా (23 నిమిషాల 20 సెకన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టామ్‌టామ్ ట్రాఫిక్ సూచిక 6 ఖండాల్లోని 55 దేశాల్లో ఉన్న 387 నగరాల మీద రీసెర్చ్ చేసి నివేదిక విడుదల చేసింది. నగరాల్లో సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులతోపాటు మరికొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని నివేదికను సిద్ధం చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూకేలోని లండన్ అత్యంత నెమ్మదిగా వాహనాలు కదిలే నగరంగా నిలిచింది. ఇక్కడ సగటున 10 కిలోమీటర్ల దూరానికి 37 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్