ఆ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారిలే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీకి గుజరాత్ రాష్ట్రంలో అత్యంత సన్నిహితంగా ఉన్న వర్గాలు విశ్వకర్మలేనని పేర్కొన్నారు.
విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని మోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 25 లక్షల జనాభ కలిగి ఉన్న విశ్వకర్మలు కులవృత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ వస్తే కులవృత్తులకు తోడ్పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారని ఆశపడ్డారని, అయితే తొమ్మిదేళ్ల కాలంలో పాలకులు విశ్వకర్మల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రాజేందర్ విమర్శించారు.
జగన్నాథం మాట్లాడుతూ విశ్వకర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.55 సంవత్సరాలు నిండిన వృత్తి కళాకారులకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10లక్షలు ఇవ్వాలని, రాజకీయంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బ్యాంకు గ్యారెంటీ లేకుండా రూ.25లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇప్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర రాజధానిలో కేటాయించిన 5ఎకరాల స్థలంలో రూ. 200 కోట్లతో అన్ని వసతులతో విశ్వకర్మ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రతిభ కనబర్చిన విశ్వకర్మ చేతి వృత్తిదారులకు గౌరవ పురస్కారాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈసందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు రాధాధీరజ్‌రెడ్డి, పవన్‌కుమార్, విశ్వకర్మ మహాసభ జాతీయ అధ్యక్షుడు చెడ్డిలాల్‌శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలే్‌షకుమార్, ప్రధాన కార్యదర్శి దినేష్ బాయ్‌శర్మ, ఉపాధ్యక్షుడు ఎంఎం శర్మ తదితరులు పాల్గొన్నారు.

More Stories
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ బిజెపి నేతల ప్రచారం!
‘కాషాయ జెండా’ తొలగింపుతో దుమారం
అప్పుల్లో అగ్రగామిగా తెలుగు రాష్ట్రాలు