
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నివాసం వద్ద విద్యార్థులు, రాజకీయ నేతలు నిరసన తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని పాలనా యంత్రాంగం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు.
సీఎం ఒమర్ అబ్దుల్లా కుమారుడు, ఆయన సొంత పార్టీకి చెందిన ఎన్సీ ఎంపీ రుహుల్లా మెహదీతోపాటు ప్రతిపక్షానికి చెందిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, ఆ పార్టీ నేత వహీద్ పారా, అవామీ ఇతిహాద్ పార్టీ చీఫ్ ఇంజినీర్ రషీద్ సోదరుడు షేక్ ఖుర్షీ తదితర నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ ఏడాది ఆరంభంలో లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని పాలనా యంత్రాంగం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాజకీయాలు ఆర్టికల్ 370, రాష్ట్ర పునరుద్ధరణ చుట్టూ తిరుగుతున్నాయని, అయితే యువత గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఇల్తిజా ముఫ్తీ విమర్శించారు.
వారికి చాలా డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్లు సమానంగా ఉండాలని అన్నారు. రిజర్వేషన్లు హేతుబద్ధం చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్సీ ప్రభుత్వం ఆ వాగ్దానాలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ నిరసనపై స్పందిస్తూ విద్యార్థి నేతలను తన కార్యాలయంలోకి పిలిపించారు. సమస్యలపై వారితో ఆయన మాట్లాడారు.
More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్ కన్నుమూత
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా