
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంటు సభ్యురాలైన కొద్దీ రోజులకే వివాదాలలో చిక్కుకుంటున్నారు. సోమవారంనాడు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఒక అందమైన బ్యాగుతో ప్రియాంక వచ్చారు. దానిపై ‘పాలస్తీనా’ అనే రాతలు ఉండటం, ఆ ఫోటోను కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ షామ మహమ్మద్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది.
దయ, న్యాయనిబద్ధత, మానవత్యానికి ఇది సంకేతమని, జెనీవా కన్వెన్షన్ను ఎవరూ ఉల్లంఘించరాదనే సందేశం ఇందులో ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఇది ముస్లింలను బుజ్జగించే చర్యగా బీజేపీ ఘాటు విమర్శలు గుప్పించింది.
More Stories
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’
గగన్యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో
ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించటం అసాధ్యం