
సిరియా అధ్యక్షుడు బాషర్ అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అతను మాస్కో చేరుకున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి. హయత్ తాహ్రిర్ అల్ షామ్ జిహాదీలతో పాటు ఇతర ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాదులు శనివారం దేశ రాజధాని డమస్కస్‌లోకి ప్రవేశించాయి. ఆ ఉగ్రదళాలు దేశ రాజధానిని నియంత్రణలోకి తెచ్చుకున్నాయి.
సిరియా అధ్యక్ష పదవి నుంచి బాషర్ అసద్ తప్పుకున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ద్రువీకరించింది. ఇస్లామిక్ దళాలతో జరిపిన చర్చల తర్వాత సిరియా అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లినట్లు కూడా రష్యా కన్ఫర్మ్ చేసింది. అసద్‌తో పాటు ఆయన కుటుంబం కూడా మాస్కో చేరుకున్నట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి సహకరిస్తామని సిరియా ప్రధాని మోహమ్మద్ అల్ జలాలీ తెలిపారు.
మరోవంక, సిరియాలో ప్రతిపక్ష బలగాలు రాజధానిపై ఆధిపత్యం కోసం ముందుకు సాగుతుండగా అక్కడ తీవ్రం అవుతున్న సంఘర్షణకు యుఎస్ మిలిటరీ దూరంగా ఉండాలని అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పిలుపు ఇచ్చారు. ‘ఇది మా పోరాటం కాదు’ అని ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్ స్పష్టం చేశారు.
రష్యా, ఇరాన్ మద్దతు ఉన్న సిరియా అధ్యక్షుడు బాషర్ అస్సద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు వేగంగా పురోగమిస్తుండడాన్ని ప్రపంచ నేతలు గమనిస్తుండగా, బైడెన్ ప్రభుత్వానికి జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రత సలహాదారుడు జేక్ సులివాన్ స్పష్టం చేశారు.
‘సిరియా అంతర్యుద్ధంలో సైనికపరంగా యునైటెడ్ స్టేట్స్ జోక్యం చేసుకోబోవడం లేదు’ అని సులివాన కాలిఫోర్నియాలో ఒక కార్యక్రమంలో సభికులతో చెప్పారు. సిరియాలో పోరు వల్ల కలుగుతున్న అవకాశాలను వినియోగించుకోకుండా ఇస్లామిక్ స్టేట్‌ను అడ్డుకోవడానికి యుఎస్ అవసరమైన చర్యలు తీసుకుంటుంది అని ఆయన సూచించారు.
సిరియా తిరుగుబాటుదారులు క్రితం నెల చివర్లో పురోగమించసాగినప్పటి నుంచి వారి నాటకీయ దూకుడు ధోరణిపై ట్రంప్ మొదటిసారిగా పైవిధంగా వ్యాఖ్యానించారు. అస్సద్ అధికారంలో కొనసాగడానికి అమెరికా దన్నుకు ఆయన అర్హుడు కాడని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి