
భారత రాజ్యాంగం సజీవ, ప్రగతి శీల పత్రమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా మనం సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంస్కృతం, మైథిలి భాషలలో రాజ్యాంగ ప్రతులను రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్మారక నాణెం, స్టాంపు విడుదల చేశారు. పాత పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర 1947లో రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26ను `సంవిధానం దివస్’గా ప్రభుత్వం జరుపుతున్నది.
ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్ధేశం చేశారని కొనియాడారు. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తు చేశారు. మన రాజ్యాగం సజీవ, ప్రగతిశీల పత్రమని, దీన్ని ఆధారంగా చేసుకునే సమాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించగలిగామని ఆమె చెప్పారు.
“మన రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల పత్రం. మన రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించాము. మహిళా రిజర్వేషన్లపై చట్టం మన ప్రజాస్వామ్యంలో మహిళా సాధికారత యొక్క కొత్త శకాన్ని ప్రారంభించింది” అని ఆమె తెలిపారు.
రాజ్యాంగాన్ని దేశపు పవిత్ర గ్రంథంగా పేర్కొంటూ, దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చలు ఒకే దేశంగా జాతీయవాద స్పృహను బలపరిచాయని ముర్ము చెప్పారు. రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యను ఆమె గుర్తుచేస్తూ భవిష్యత్తులో రాజ్యాంగం ఎలా పని చేస్తుందో దానిని అమలు చేసే వారిపై ఆధారపడి ఉంటుందని అన్నారని పేర్కొన్నారు.
పేదలకు పక్కా గృహాలు అందించడంతో పాటూ మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పరోగతిని సాధించామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన 15 మంది మహిళల సేవలను గుర్తు చేసుకున్నారు.
పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రసంగీస్తూ మన రాజ్యాగం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని తెలిపారు. ఇది మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే సందర్భమని చెప్పారు. పార్లమెంటు సభ్యులు ప్రజాస్వామ్య సంరక్షకులని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు నిలిపివేసిన చీకటి కాలం ఎమర్జెన్సీ అని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న కోట్లాది మంది భారతీయులకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. రాజ్యాంగం మన దేశ ప్రజల సంవత్సరాల తపస్సు, త్యాగం, చాతుర్యం, శక్తి మరియు సామర్థ్యాల ఫలితమని తెలిపారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!