
శ్రేయాస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు పోటీపడ్డాయి. వేలం రూ.7.5 కోట్లు దాటిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలోకి వచ్చింది. రెండు జట్లు ధర పెంచుకుంటూ పోయాయి. దాంతో ఐపీఎల్ వేలంలో రూ.20 కోట్ల మార్క్ దాటిన తొలి భారత ప్లేయర్గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2024లో మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లు ధర పలికి అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
ఇప్పుడు ఆ రికార్డును శ్రేయాస్ అయ్యర్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో రూ.25 కోట్ల మార్కు దాటిన మొదటి ఆటగాడిగా కూడా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. చివరికి పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. దాంతో స్టార్క్ రికార్డు బద్ధలైంది. ఆ తర్వాత కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ రికార్డును రిషబ్ పంత్ బద్ధలు కొట్టాడు. కాగా, ఈసారి వేలంలో మిచెల్ స్టార్క్ ధర ఘోరంగా పడిపోయింది. గత ఐపీఎల్లో రూ.24.75 కోట్ల ధర పలికిన స్టార్క్ ఈసారి 11.75 కోట్లకు అమ్ముడు.
రూ. 2 కోట్ల కనీస ధర గల టీం ఇండియా పేస్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ కోసం తొలుత చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్ టైటాన్, రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, రాజస్థాన్ బిడ్ వేసినా ఉపయోగం లేకపోయింది. ఆర్టీఎం కార్డుతో అర్ష్ దీప్ను రూ.18 కోట్లకు పంజాబ్ ఎలెవెన్ గెలుచుకున్నది.
ఇక లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ మాజీ సారధి కేఎల్ రాహుల్ ను రూ.14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నది. గాయంతో కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఇండియన్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.10 కోట్లకు గెలుచుకున్నది.
More Stories
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ