
* తొమ్మిది స్థానాలలో ఏడు చోట్ల విజయం
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తొమ్మిది స్థానాలకు ఏడు స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. సమాజ్ వాదీ పార్టీ కర్హల్, సిషామౌలను గెలుచుకుంది. కుందర్కి, ఖైర్, ఘజియాబాదాద్, ఫుల్పూర్, కతెహారి, మఝవాన్ సీట్లలో బీజేపీ, మీర్‌పూర్‌లో ఆర్ఎల్‌డీ గెలుచుకున్నాయి.
విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఉప ఎన్నికలు జరిగిన తొమ్మిది స్థానాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
చారిత్రాత్మక విజయం సాధించిన ఘనత ప్రధాని మోదీ నాయకత్వానికే దక్కుతుందని తెలిపారు. ప్రధాని మోదీపై ప్రజలకు నమ్మకం ఉందని సీఎం యోగి చెప్పారు. ఈ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల ‘ఊట్ అండ్ ఝూట్ రాజకీయాలకు’ ముగింపు పలికాయని చెప్పారు. మహారాష్ట్ర గురించి మాట్లాడుతూ, ఆ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలోచనల విజయమని, బాబా సాహెబ్ అంబేద్కర్‌ను దుర్వినియోగం చేసేవారికి ప్రతిస్పందన అని తెలిపారు.
ఉప ఎన్నికల ఫలితాలపై వరుస ట్వీట్లలో యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ”యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ-ఎన్‌డీఏ విజయం మోదీ విజయవంతమైన నాయకత్వం, నిర్దేశకత్వంపై ప్రజలు ఉంచిన అంచంచల విశ్వాసానికి తార్కాణం. డబుల్ ఇంజన్ ప్రభత్వంలో భద్రత, సుపరిపాలన, ప్రజాసంక్షేమ పథకాలు, అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేసిన కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది. విజేతలైన అభ్యర్థులందరికీ నా అభినందులు. విభజిస్తే మనం పడిపోతాము… ఐక్యంగా నిలబడతాం ((బటేంగే తో కటేంగే… ఏక్ రహేంగే తో నేక్ రహేంగే)) అని యోగి పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ యోగి ఆదిత్యనాథ్ ఈ నినాదాన్ని ‘ట్రంప్ కార్డు’గా ఎంచుకున్నారు.
ఖటాఖత్ పథకంతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మండిపడ్డారు. విభజన రాజకీయాలను ధిక్కరించి బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసిన 9 నియోజకవర్గాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కర్హాల్‌లో యాదవుల ఓట్లు కూడా బీజేపీకి అనుకూలంగా రావడంతో ఎస్పీ సీటు కేవలం గెలుపొందిందని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ ప్రభావాన్ని నొక్కిచెప్పిన ఆయన, ఆయన పథకాలు గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడ్డాయని పేర్కొన్నారు.
మరో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పార్టీ కార్యకర్తలు, నాయకులను అభినందించారు. కతేహ్రీలో బీజేపీ గెలిచిందని, వచ్చేసారి కర్హల్ గెలుస్తుందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీని ఉద్దేశించి మౌర్య పిడిఎ ‘పరివార్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ’ అని విమర్శించారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఉపఎన్నికలు సెమీ ఫైనల్ అని చెప్పుకునే వారికి ఈ ఫలితాలు సమాధానమని ఆయన ఎద్దేవా చేశారు. విజయంపై మహారాష్ట్రలోని పార్టీ నేతలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి దాదాపు 50 శాతం ఓట్లు వచ్చాయని, అందుకే 50 శాతం హమారా హై బాకీ మే బట్వారా హై అని ఆయన పేర్కొన్నారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం