అయితే, సీసీఐ నిర్ణయంపై స్పందిస్తూ ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మెటా పేర్కొంది. సీసీఐ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన అప్‌డేట్ కారణంగా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలిపింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
కాగా, ప్రైవసీ విధానానికి సంబంధించి 2021లో తీసుకొచ్చిన అప్‌డేట్ ప్రకారం. వాట్సప్ సేవలను పొందడం కొనసాగించాలంటే, ఇందులో లభించే డేటాను మెటా కంపెనీలతో పంచుకునేందుకు వినియోగదారులు తప్పనిసరిగా అంగీకరించాలి. 2016 నాటి విధానం ప్రకారం ఈ విషయంలో వినియోగదారులదే తుది నిర్ణయం.
అయితే, అందుకు భిన్నంగా కొత్త విధానాన్ని అమలు చేసినందుకు ఈ మెటాకు సీసీఐ జరిమానా విధించింది. ఇలాంటి పద్ధతులు సరికాదని, తమ వివరాలను మెటాతో పంచుకోవాలా, వద్దా అని నిర్ణయించుకునే హక్కును వినియోగదారులకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలని సీసీఐ స్పష్టం చేసింది. ఐదేళ్ల వరకు ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా కంపెనీలతో యూజర్ డేటాను పంచుకోవడం నిలిపివేయాలని వాట్సాప్‌ను సీసీఐ ఆదేశించింది.

More Stories
దేశ ఆర్థిక వ్యవస్థ 7-7.4 శాతం వృద్ధి రేటు
మద్యం పాలసీ కేసు విచారణలో సీబీఐ వేరు, ఈడీ వేరు
ఢిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు