
సాధారణంగా కాలుష్య స్థాయిని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రూపంలో కొలుస్తుంటారు. ప్రమాణాల ప్రకారం 0-50 మధ్య ఏక్యూఐ నమోదైతే.. గాలి నాణ్యత బాగుందని పేర్కొంటారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 151 నుంచి 200 మధ్య ఉన్నట్లు గుర్తించినట్లయితే ప్రమాదకర స్థితికి కాలుష్యం చేరుకుందని పేర్కొంటారు. ప్రమాదకరం. 201-300గా గుర్తించినట్లయితే చాలా ప్రమాదకర స్థితికి చేరుకుందని, 301 కంటే ఎక్కువగా నమోదైతే అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు.
ఈ కాలుష్య నగరాల జాబితాలో ముంబయి నగరం 158 గాలి నాణ్యత సూచీతో 10వ స్థానంలో ఉన్నది. ఆ తర్వాత 136 ఏక్యూఐతో కోల్‌కతా ఆ తర్వాతి స్థానంలో ఉన్నది. స్విస్ సంస్థ జాబితాలో 432 ఏక్యూఐతో లాహోర్ రెండోవ స్థానంలో ఉండగా.. కరాచీ నగరం 147 ఏక్యూఐతో 14వ స్థానంలో ఉన్నది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన కిన్షాసా కాలుష్య నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది.
ఈజిప్ట్‌కి చెందిన కైరో 184 ఏక్యూఐతో నాలుగో స్థానంలో నిలిచింది. వియత్నాం రాజధాని హనోయి ఐదో స్థానంలో ఉన్నది. ఇక్కడ ఏక్యూఐ 168గా ఉన్నది. ఖతార్‌లోని దోహా నగరం ర్యాంకింగ్‌లో ఆరో స్థానంలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రియాద్ 7వ స్థానం, మంగోలియాలోని ఉలాన్బాటర్ 9వ స్థానం, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 17వ స్థానంలో ఉన్నది. చైనాలోని ఏడుగు నగరాల్లో కాలుష్యం భారీగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
More Stories
ఢిల్లీలో నలుగురు బీహార్ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం
లోక్‌పాల్ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం
శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం