ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసులో కంగనాకు ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగ్రాలోని రాజీవ్ గాంధీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామశంకర్ శర్మ, సీనియర్ న్యాయవాది ఈ ఏడాది సెప్టెంబర్ 11న కంగనాపై కేసు వేశారు. ఆగస్టు 27న పత్రికల్లో కంగనా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయన కేసు నమోదు చేశారు.
కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన రైతులను ఉద్దేశించి మాట్లాడుత మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉండేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని, సాగు చట్టాలను వెనక్కితీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వార్థ ప్రయోజనాలను ఆశించే వారు నిరసనలను ప్రోత్సహించారని ఆమె ఆరోపించారు.
బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారంటూ కంగనా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలో దుమారం రేపాయి. అదే సమయంలో ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కంగనా రనౌత్ దేశంలోని కోట్లాది మంది రైతులను అవమానించారని రామశంకర్ శర్మ ఆరోపించారు.ఆమె రైతులను హంతకులు, రేపిస్ట్‌లు, తీవ్రవాదులతో పోల్చిందని మండిపడ్డారు. తాను ఓ రైతు కుమారుడినేనని.. తాను చూడా వ్యవసాయం చేశానన్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సైతం గుర్తు చేశారు.
పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది రామశంకర్ శర్మతో పాటు గ్రేటర్ ఆగ్రా బార్ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాది దుర్గ్ విజయ్ సింగ్ భయ్యా, రామ్‌దత్ దివాకర్, ఆర్‌ఎస్ మౌర్య, రాకేష్ నౌహ్వార్, బిఎస్ ఫౌజ్దార్, రాజేంద్ర గుప్తా, ధీరజ్, ఉమేష్ జోషి, డాక్టర్ రాజ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం వ్యక్తిగతంగా హాజరై ఈ నెల 28న తన పక్షాన్ని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.
More Stories
లింగాయత్ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?