విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వీపీ సింధు ఆంధ్రప్రదేశ్‌లో తన పేరు మీద బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం రూరల్ మండలం చినగదిలి మండలంలో పెదగదిలి కూడలి సమీపంలో.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి సింధు తల్లిదండ్రులతో కలిసి భూమిపూజ చేశారు. 
 
ఆ స్థలంలో భూమిపూజ చేసిన సింధు పనులు త్వరగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు పీవీ సింధు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యువతకు బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పీవీ సింధుకు మూడెకరాల స్థలం కేటాయించింది. 
 
అయితే పీవీ సింధుకు కేటాయించిన స్థలాన్ని జూనియర్ కాలేజీకి కేటాయించాలంటూ కొద్దిరోజుల క్రితం స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదే సందర్బంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీడీపీ నేత ఒమ్మి సన్యాసిరావు స్థానికులతో కలిసి అక్కడ నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. 
 
అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ స్కూల్‌కి ఆనుకుని ఉన్న స్థలాన్ని జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం కాకుండా బ్యాడ్మింటన్ అకాడమీకి కేటాయించడాన్ని తాము అంగీకరింబోమని స్థానికులు అంటున్నారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు.. ఇటీవల నిరన చేశారు. ఈ క్రమలో వీసీ సింధు ఇవాళ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 
 
పీవీ సింధుకు 2021 జూన్‌లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖపట్నం రూరల్ మండలం చినగదిలి మండలంలో రెండెకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని బ్మాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ఇచ్చారు. చిగదిలిలో ఉన్న మూడు ఎకరాల స్థలం పశు సంవర్థక శాఖకు చెందినది కాగా.. రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయించింది.
 
అప్పటి ప్రభుత్వం. అప్పుడే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వగా.. అనంతరం క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాల భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
పీవీ సింధుకు కేటాయించిన ఈ స్థలానికి సంబంధించి నిబంధనల ప్రకారం.. అకాడమీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, మూడేళ్లకు ఐటీ రిటర్న్స్ సమర్పించారు. ఆ తర్వాతే పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీకి బదలాయించారు. ఈ భూమిని కేవలం బ్మాడ్మింటన్ అకాడమీ అవసరాల కోసమే వినియోగించాలని.. కమర్షియల్‌ అవసరాల కోసం వినియోగించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.