
కెనడా పోలీసులు భారత అధికారులను ప్రశ్నించకముందే ఆంగ్ల దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు సమాచారాన్ని లీక్ చేసినట్లు అధికారులు అంగీకరించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని కెనడా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.
కెనడాలో సిక్కు వేర్పాటువాదులపై దాడుల వెనుక భారత ప్రభుత్వ ఉన్నతాధికారి హస్తం ఉందని ట్రూడో ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రూయిన్ చెప్పినట్లు సమాచారం. సమాచారాన్ని లీక్ చేయడానికి తనకు ట్రూడో అనుమతి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సమాచారాన్ని లీక్ చేయడం కమ్యూనికేషన్ స్ట్రాటజీలో భాగమేనని డ్రూయిన్ చెప్పడం గమనార్హం.
ట్రూడో కార్యాలయం కమ్యూనికేషన్ వ్యూహాన్ని నిర్వహించిందని సలహాదారు తెలిపారు. ‘భారత్‌తో సహకారం కోసం మేం తీసుకున్న చర్యల గురించి రహస్య సమాచారం లేదు. కెనడా పౌరులపై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని ఆధారాలు చూపిస్తున్నాయి.’ అని ఆయన తెలిపారు. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సింగపూర్ లో కెనడా విదేశాంగ మంత్రిని కలిశారని వాషింగ్టన్ పోస్ట్‌లో ఓ కథనం ప్రచురితమైంది.
సెప్టెంబర్ 12న జరిగిన ఈ సమావేశంలో తాను, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డేవిడ్ మోరిసన్, ఆర్సీఎంపీ కమిషనర్ మార్క్ ఫ్లిన్ పాల్గొన్నట్లు డ్రూయిన్ తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి అనేక చర్యలు ప్రవేశపెట్టామని చెప్పారు. మేం సమర్పించిన సమాచారాన్ని అంగీకరించడానికి దోవల్ నిరాకరించారని వెల్లడించారు.
కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై నిజ్జార్ హత్య, దాడులను నిర్వహించడానికి భారత్ క్రిమినల్ నెట్‌వర్క్‌లను, ప్రత్యేకంగా బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉపయోగించిందని కెనడా అధికారులు ఆరోపించిన రుజువులను సమర్పించారు. ఈ వార్తల లీకేజీపై పార్లమెంటరీ ప్యానెల్ మండిపడింది. ట్రూడో, ఆయన కేబినెట్ మంత్రులు, పోలీసులు ఆ సమాచారాన్ని ప్రజలతో పంచుకోకుండా పత్రికకు ఎందుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ప్యానెల్ ప్రశ్నించింది.
అక్టోబరు 14న ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను న్యూఢిల్లీ బహిష్కరించిన తర్వాత కెనడా, భారతదేశం మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారతదేశ హైకమిషనర్‌ను నిజ్జార్ కేసులో పేర్కొన్నందుకు వివాదం పెద్దగా అయింది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక