
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ తన ఓటమికి ఈవీఎంలే కారణమని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన అప్పటి వైసిపి అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కెదురైంది. ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని, వీటిలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గతంలో కోరారు.
అయితే తన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పరిశీలనను తప్పుబడుతూ అనంతరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆదేశించాలంటూ పిటిషన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి పిల్‌ను విచారించిన హైకోర్టు పిటిషన్ కొట్టివేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది.
దీనిపై గతంలోనే విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును మాత్రం రిజర్వు చేసింది.
సోమవారం బాలినేని పిటిషన్ ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈవీఎంల అక్రమాల విషయంలో ఈసీ వద్దే తేల్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఒంగోలులో ఈవీఎం అక్రమాలపై మాక్ పోలింగ్ నిర్వహించిన ఈసీ అక్రమాలు గుర్తించలేదు. దీంతో ఈసీ తీసుకునే ఫైనల్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. అయితే గతంలో ఈ కేసు వేసినప్పుడు వైసీపీలో ఉన్న బాలినేని, ఆ తర్వాత జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
మరోవైపు ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ విధానాలు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును తప్పుబడుతూ పార్టీకి రాజీనామా చేశారు బాలినేని. అలాగే ఎన్నికల్లో అవకతవకలపై తన పోరాటానికి వైసీపీ మద్దతుగా నిలవడం లేదంటూ అప్పట్లో ఆరోపించారు.
More Stories
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
ఈనెల 22న బీజేపీ రాష్ట్ర వ్యాప్త సంబరాలు