
ఆధార్ స్కీమ్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన కర్నాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి కేఎస్ పుట్టస్వామి కన్నుమూశారు. 2012లో ఆధార్ నమోదుకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారు. ఎటువంటి శాసనపరమైన మద్దతు లేకుండానే ఆధార్ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన ఆరోపించారు. 92 ఏళ్ళ వయస్సులో ఆయన చేసిన న్యాయపోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు ఆధార్ ను కొనసాగించినా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగంగా గోప్యత ప్రాధమిక హక్కులలో ఒకటని మాత్రం గుర్తించింది.
అక్టబోర్ 28వ తేదీన ఆయన తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 98 ఏళ్ల వయసున్న పుట్టస్వామి.. ఫిబ్రవరి 8వ 1926లో బెంగళూరుకు సమీపంలోని ఓ గ్రామంలో జన్మించారు. మైసూరులోని మహారాజ కాలేజీ, బెంగుళూరులోని లా కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1952లో ఆయన అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నారు. హైకోర్టుకు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ బిసి కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ అంశంలో గోప్యత హక్కు కోసం ఆయన పోరాటం చేశారు. ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కు అన్నారు.
పుట్టస్వామి కుమారులలో ఒకరైన బిపి శ్రీనవాస్ ప్రకారం, పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన బీహార్, జార్ఖండ్ మాజీ గవర్నర్ రామ జోయిస్ తో జరిపిన వరుస చర్చలు అనంతరం ఆధార్ ను సవాల్ చేయాలనే నిర్ణయంలో తన తండ్రి ఓ నిర్ణయానికి వచ్చారని చెప్పారు. శ్రీనివాస్ ప్రకారం, పుట్టస్వామి పిటిషన్ ను న్యాయవాది అయినా అతని సోదరుడు బి పి మహేంద్ర, న్యాయవాది, ఇతరుల సహాయంతో తమ ఇంటి మూలలో కార్యాలయంగా మార్చిన ఒక చిన్న గదిలో దీనిని రూపొందించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు