
రెండు రోజుల బ్రిక్స్ సదస్సులో వివిధ అంశాలపై విస్తృతమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నానని మోదీ పేర్కొన్నారు. గత సంవత్సరం కొత్త సభ్యుల చేరికతో బ్రిక్స్ విస్తరణ కూటమి సమగ్రతను, ప్రపంచ శ్రేయస్సు కోసం ఎజెండాను చేర్చేందుకు తోడ్పడిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచ అభివృద్ధి అజెండా, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, సరఫరా గొలుసులను నిర్మించడం,సాంస్కృతిక అనుసంధానతను ప్రోత్సహించడం వంటి అంశాలపై బ్రిక్స్‌లో చర్చలు ఉంటాయని తెలిపారు.
ఇక ‘ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ ప్రధాన నినాదంగా ఈ ఏడాది బ్రిక్స్ సదస్సు జరగుతుంది. ఈ సమిట్లో సభ్య దేశాధినేతలు అందరూ పాల్గొంటున్నారు. అయితే బాత్రూమ్‌లో పడి తలకు గాయం కావడం వల్ల బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా సదస్సుకు వర్చువల్గా హాజరవుతున్నారు.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు. ప్రధాని మోదీ రష్యా పర్యటన చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. కజాన్ పర్యటనతో భారత్, రష్యాల మధ్య ‘ప్రత్యేకమైన, విశేష అధికారాల వ్యూహాత్మక భాగస్వామ్యం’ను బలపరుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’