మావోయిస్ట్‌ కీలక నేతలు పోతుల కల్పన, సుజాతల అరెస్ట్

మావోయిస్ట్‌ కీలక నేతలు పోతుల కల్పన, సుజాతల అరెస్ట్

వరుస ఎన్‌కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణాలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక మహిళా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్ట్‌ దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌ జీ భార్య పోతుల కల్పన అలియాస్‌ సుజాతక్కను మహబూబ్‌నగర్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆమె సౌత్ సబ్ జోనల్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్నారు.

మరోవంక, మావోయిస్టు కీలక నేత సుజాతను కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన ఆమెపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో రూ.కోటికిపైగా రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ]సుజాత బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

సుజాతక్క కేంద్ర కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. ఆమె కల్పన అలియాస్‌ సుజాతక్క, మైన్‌బాయి, పద్మ, ఝాన్సీబాయిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆమె భర్త కిషన్‌జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలో 2011లో పశ్చిమ బెంగాల్‌ జార్‌గ్రామ్‌లోని బురిషోల్ జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

కిషన్‌ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు సైతం మావోయిస్ట్‌ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు.  ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.కిషన్ జీ భార్య సుజాతక్క సైతం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వయసు 60 సంవత్సరాలు.

అయితే, ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ బస్తర్‌ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉంటున్నారని, పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసుకునే ఆమె ఎందుకు బయటకు వచ్చారనే విషయం తెలియరాలేదు. అయితే, వైద్య పరీక్షల కోసం మహబూబ్‌నగర్‌కు వచ్చారా? షెల్టర్‌ జోన్‌లో ఉంటున్నారా? అన్న సమాచారం తెలియాల్సి ఉన్నది. ఆమెను ఎప్పుడు.. ఎక్కడ ? అరెస్ట్‌ చేశారన్న వివరాలు సైతం వెల్లడి కావాల్సి ఉంది. సూజాతక్క క్రాంతికారీ జనతన్ సర్కారు వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను అరెస్టుపై పోలీసు వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా, సుజాత సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు. చికిత్స నిమిత్తం కొత్తగూడెంలోని దవాఖానకు వెళ్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌ 4న ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతి చెందిన వారిలో రూ.25 లక్షల రివార్డున్న దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు, తూర్పు బస్తర్‌ డివిజన్‌ ఇన్‌చార్జి నీతి అలియాస్‌ ఊర్మిలతో పాటు డివిజినల్‌ కమిటీ సభ్యులు సురేశ్‌ సలాం, మీనా మడకం ఉన్నారు.