
హర్యానా ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిన్నట్లు కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కొట్టిపడేశారు. ఎన్నికల తర్వాత ప్రతిసారీ ఈవీఎంలపై ఆరోపణలు వస్తున్నాయని, ఈ సారి బ్యాటరీపై ఆరోపణలు వచ్చాయని, తర్వాత ఇంకేమి వస్తాయో అంటూ ఎద్దేవా చేశారు. ఓసారి ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చని, ఓసారి పేజర్లా పేలుతుందని చెబుతుంటారని చెబుతూ అయితే, తాము ప్రతీసారి ఆరోపణలను ఖండిస్తున్నామని గుర్తు చేశారు.
ఈవీఎంలు, బ్యాటరీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించామని తెలిపారు. హర్యానాలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పాయింట్‌తో పూర్తిగా స్పందన తెలియజేస్తాని, ఎన్నికల సంఘం వెబ్సైట్లోనూ పబ్లిష్ చేస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల వినియోగంపై కమిషన్ నుంచి కౌంటింగ్ వరకు అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని ప్రతి లోక్‌సభ ఆర్ఓను కోరామని చెప్పా రు.
ఫలితాలు అనుకూలంగా లేని సమయంలో ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని అంటూ విమర్శించారు. ఎన్నికలకు ఐదారు నెలల నుంచే ఈవీఎంల ర్యాండమైజేషన్, చెకింగ్ ప్రక్రియ ప్రారంభవుతుందని చెప్పారు. ఆ తర్వాత తనిఖీలు, నిల్వ, ఆ తర్వాత బయటకు తీయడం, కమిషన్ చేయడం, పోలింగ్ రోజున ఈవీఎంలు తీయడం, ఆ తర్వాత అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించడం, కౌంటింగ్ మొదలు నుంచి ముగిసే వరకు.. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు ఈవీఎంల ప్రతి ప్రక్రియలో పాల్గొంటారని గుర్తు చేశారు.
పోలింగ్‌కు ఐదు నుంచి ఆరు రోజుల ముందు ఈవీఎంను కమీషన్ చేస్తారని, ఆ రోజునే బ్యాటరీని అందులో ఉంచుతారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. గుర్తులను సైతం అదే రోజు ఫీడ్ చేస్తారని, కమీషన్ చేసిన తర్వాత, బ్యాటరీ సీలు చేస్తారని, అభ్యర్థితో పాటు ఏజెంట్లు సంతకం చేస్తారని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఈవీఎంలు మూడంచెల భద్రతలో ఉంటాయని, పోలింగ్ రోజు సైతం ఇదే జరుగుతుందని వివరించారు.
ఓటు వేసిన తర్వాత కూడా ఈవీఎం చూపించి అభ్యర్థి ఏజెంట్ సంతకం తీసుకుంటారని తెలిపారు. ఇలా మరెక్కడా జరుగదని, ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారని రాజీవ్ కుమార్ చెప్పకొచ్చారు. ఈవీఎంలలో సింగిల్ యూజ్ బ్యాటరీలు ఉంటాయని చెబుతూ బ్యాటరీ వేసిన సమయంలో ఛార్జ్ శాతం, వోల్టేజ్ ఎంత వరకు ఉందో కనిపిస్తుందని పేర్కొన్నారు.
ఈవీఎంలను ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉంచిందని స్పష్టం చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో, కాంగ్రెస్ ఈవీఎం, బ్యాటరీ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసింది. 20 అసెంబ్లీ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మెమోరాండం ఇచ్చింది. కాంగ్రెస్ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి