సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత హాన్‌కాంగ్‌ను వరించింది. చారిత్రక గాయాలను ఎదుర్కొంటూ, మానవ జీవితంలోని దుర్బలత్వాన్ని బట్టబయలు చేసే హృద్యమైన కవిత్వానికి నోబెల్ బహుమతి లభించింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాన్ని ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టినట్లుగా రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.
కాగా, దక్షిణ కొరియా రచయిత నోబెల్ బహుమతికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. 53 ఏళ్ల హాన్ కాంగ్ 1993లో ‘లిటరేచర్ అండ్ సొసైటీ’ అనే మ్యాగజైన్‌లో అనేక కవితలను ప్రచురించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించింది. 1995లో ‘లవ్ ఆఫ్ యెయోసు’ అనే చిన్న కథా సంకలనంతో ఆమె గద్య ప్రవేశం జరిగింది, ఆ తర్వాత అనేక ఇతర గద్య రచనలు, నవలలు, చిన్న కథలు రెండూ వచ్చాయి.
2016లో ‘ది వెజిటేరియన్’ అన్న నవలకు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. మాంసం తినడం మానేయాలని మహిళ తీసుకున్న నిర్ణయం వల్ల కలిగిన వినాశకరమైన పరిణామాలను ఈ నవల వివరిస్తుంది. సాహిత్యంలో నోబెల్ బహుమతిని 1901 నుండి ప్రదానం చేస్తున్నారు. సంవత్సరాలుగా 120 మంది గ్రహీతలతో. మొత్తం 116 సార్లు అవార్డు అందించారు. వారిలో 103 మంది పురుషులకు, 17 మంది మహిళలకు మాత్రమే ఉన్నారు. ఇది బహుమతి చరిత్రలో కొనసాగిన అద్భుతమైన లింగ అసమానత.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!