
అయితే, ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం మరోసారి సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు జూనియర్ డాక్టర్లు శనివారం నిరాహార దీక్షకు దిగారు.
డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి 24 గంటల నోటీసు ఇచ్చామని, ప్రభుత్వం స్పందించకపోవడంతోనే నిరాహార దీక్ష చేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ జూనియర్ వైద్యుల ఫ్రంట్ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా సీనియర్ డాక్టర్లు రాజీనామా చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
మరోవైపు డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ సోమవారం సీల్డాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 200 మందికి పైగా వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌గా తేల్చింది. రాత్రి విరామ సమయంలో దవాఖాన సెమినార్ హాల్లోకి వెళ్లిన వైద్యురాలిపై సివిక్ వలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఘాతుకానికి పాల్పడ్డాడని సీబీఐ తెలిపింది. గ్యాంగ్ రేప్ జరిగిందా? లేదా? మరికొంత మంది ప్రమేయం ఇందులో ఉందా? అన్నది తేల్చేందుకు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొంది.
More Stories
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్
శబరిమల ఆలయం బంగారు మాయంపై క్రిమినల్ కేసు