బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు

బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
బంజారాల సంస్కృతి సంప్రదాయాలను వెలుగులోని తీసుకురావాలని బంజారా మ్యూజియంను మహారాష్ట్రాలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ విదేశాలలోని ఒకే వేష, భాష కలిగిన బంజారాల పక్షాన  మాజీ ఎంపీ, బిజెపి నేత  సీతారాం నాయక్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

వేల సంవత్సరాలుగా పునాది రాళ్ళుగా దాగి ఉన్న బంజారాల ఇతిహాసాన్ని మహారాష్ట్ర, వాశిం జిల్లా, మానోర తాలుక, పౌరదేవి గ్రామం లో  సంత్ సేవాలాల్, దండి మేరామా (పౌరాదేవి) పేరు మీద రూ.900 కోట్ల వ్యయంతో సంగారా భవన్ ను నిర్మించారు.  బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నానని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణలో 10శాతం గిరిజనులలో 6 నుండి 7శాతం మంది బంజరాలు ఒకే భాష మాట్లాడేవారున్నారని చెబుతూ  బంజారా అనేది ఒక మూలం, సంచార జీవనంలో గూడు చెదిరిన పక్షుల స్థిర నివాసాలు లేకుండా, పశువులలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మి వాటి సహకారంతో తమదైన ప్రత్యేక రవాణా వ్యవస్థ’ నీ ఏర్పరచుకున్నారని ఆయన తెలిపారు.

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రి బంజారాల గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. . బంజారాల చరిత్రను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.  దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలవబడుతున్న బంజారాలు రాజ్యాంగ ఫలాలకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం బంజారాలను రాజ్యాంగంలో చేర్చకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆయన విమర్శించారు. .

మైథిలి, కొంకిని, కోడ భాష మాట్లాడే కోటి మందిని 8వ షెడ్యూల్డ్ లో చేర్చారని, 12 కోట్ల మంది మాట్లాడే బంజారా భాషని 8వ షెడ్యూల్డ్ లో చేర్చాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నామని సీతారాం నాయక్ తెలిపారు. బంజారా ప్రజల కోసం రాష్ట్రంలో ఒక్క మంత్రిని కూడా రేవంత్ రెడ్డి నియమించలేదని ధ్వజమెత్తారు.

దేశ ప్రధాని మోదీ గారు బంజారాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంటే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల ఆత్మ గౌరవం కోసం సేవాలాల్ మహరాజ్ ల  విగ్రహాలను కూడా పెట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంజారా అనే పదం గొడుగు అంటూ బంజారా జాతిని మొత్తాన్ని ఒకే దగ్గర చేర్చాలని ప్రధాని మోదీకి ఆయన వింగపతి చేశారు.  అంతరించే దశలో ఉన్న బంజారా ఇతిహాసాన్ని మోదీ గారు చరిత్రగా మార్చారని కొనియాడారు.  మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, బిజెపి ఎస్ టి మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బాబి నాయక్, రాష్ట్ర అధ్యక్షులు డా. కళ్యాణ్ నాయక్ కూడా పాల్గొన్నారు.