
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయం లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అక్టోబర్ 12 వరకు ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది.
పురటాసి మాసం కూడా వస్తున్నందు వల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు, జిల్లాయంత్రాంగం సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని టిటిడి ఇఒ జె. శ్యామలరావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా