
డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి సమీపంలో ఉన్న ఈ మసీదులో నిరాశ్రయులైన జనం ఉంటున్నారు. ఆదివారం ఉదయం మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో 24 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ దాడిపై ఇజ్రాయిల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. డెయిర్ అల్ -బలాV్‌ా ప్రాంతంలో గతంలో షుహాద్ అల్-అక్సా మసీదుగా ఉన్న నిర్మాణంలో హమాస్ ఉగ్రవాదులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహిస్తున్నారని, వారి లక్ష్యంగా దాడి జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
ఉత్తర లెబనాన్‌లోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ అధికారి, అతడి కుటుంబసభ్యులు మరణించారని హమాస్ శనివారం వెల్లడించింది. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో సంగీత కార్యక్రమంపై హమాస్ దాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక్క గాజాలోనే దాదాపు 42 వేల మంది మరణించారు.
యుద్ధం ప్రారంభం నుంచి హమాస్‌కు ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. కానీ ఇటీవల హెజ్‌బొల్లా కీలక నేతలను హతమార్చడంతోపాటు తమ భూభాగంలో కొంత మంది నేతలను ఇజ్రాయెల్ చంపడంతో స్వయంగా క్షిపణులను ప్రయోగించింది. దాంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 200 క్షిపణులతో తమపై దాడి చేసిన ఇరాన్‌పై భీకరస్థాయిలో విరుచుకుపడతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా
బలూచ్ ఆర్మీని ఉగ్రసంస్థగా ప్రకటించే అభ్యర్థనకు అమెరికా వీటో