
అదే సమయంలో ఇషా ఫౌండేషన్ దర్యాప్తునకు ఆదేశించడానికి హైకోర్టు ఎటువంటి బలమైన కారణాలను చెప్పలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఛాంబర్‌లో ఉన్న ఇద్దరు మహిళలతో నేరుగా మాట్లాడింది. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టేటస్ రిపోర్టును అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించారని, బాలల సంరక్షణ అధికారులతో సహా ఆశ్రమంలో దర్యాప్తు తగిన చర్యలు, వనరులతో జరిగిందని తెలిపారు. ‘ఇది మత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఇది చాలా తీవ్రమైన, అత్యవసరమైన విషయం. లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న సద్గురు ఉన్న ఇషా ఫౌండేషన్‌తో ఇది అనుబంధం కలిగి ఉంది. మౌఖిక ఆరోపణల ఆధారంగా హైకోర్టు ఇలాంటి విచారణను ప్రారంభించరాదు.’ అని ధర్మాసనం పేర్కొంది.
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా ఈ కేసు నమోదైంది. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో 42, 39 ఏళ్ల వయసున్న తన ఇద్దరు విద్యావంతులైన కూతుళ్లను బ్రెయిన్ వాష్ చేశారని కామరాజ్ ఆరోపించారు. ఫౌండేషన్ అధికారులు తన కుమార్తెలను కుటుంబంతో ఎటువంటి సంబంధాన్ని కొనసాగించడానికి అనుమతించలేదని కామరాజ్ కోర్టుకు తెలిపారు. ఫౌండేషన్ పై అనేక క్రిమినల్ కేసులు, లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు