ఏడు దశాబ్దాలుగా వడ్డెర వర్గానికి చెందిన వారు ఇక్కడే నివాసం ఉంటున్నారని, .ఇప్పుడేమో అక్రమ కట్టడాలు అంటూ నోటీసులు ఇస్తున్నారని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇలాంటి నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, బారికి బీజేపీ అండగా ఉందని భరోసా ఇచ్చారు.
హైడ్రా అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం చెరువులు, కుంటలు చుట్టూ ఉంది.. ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పేదల ఇళ్లను కూల్చవద్దని ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. . చట్టాలు, జడ్జీల మీద నమ్మకం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని ఎంపీ విమర్శించారు. తెలంగాణ రేవంత్ జాగిర్ కాదని… ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారన్న విషయం గుర్తుపెట్టుకుని మసలుకోవాలని హితవు చెప్పారు.
సికింద్రాబాద్లోని అల్వాల్ జొన్నల బండ సమీపంలో నివసిస్తున్న స్థానికులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో భయభ్రాంతులకు గురతుండడంతో రాజేందర్ వారికి ధైర్యం చెప్పడానికి వెళ్లారు. శని, ఆదివారాలు సెలవు రోజుల్లో నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా కూల్చివేతలు నిర్వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని చెబుతూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ నది సుందరీకరణ చేస్తానంటూ, స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పనితీరు తెలుసుకోవడానికి ఆరేళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం ఆరు నెలల్లోనే తెలిసిపోయిందని ధ్వజమెత్తారు.
జొన్నల బండ వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని వాటిని కూడా కూల్చేందుకు రేవంత్ ప్రభుత్వం పనులు చేస్తోందని రాజేందర్ తెలిపారు. మూసీని సుందరీకరణ చేస్తే తమకు ఇబ్బంది లేదని, కానీ ఎన్నడో భూమి కొన్న వారు ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నారని తెలిపారు. లక్షలు పెట్టి కొన్న ఇళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామనడ భావ్యంకాదని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ఈ ప్రాంతాల్లోకి ఏనాడూ మూసీ నుంచి వరద నీరు రాలేదని తెలిపారు. హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం బస్తీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ మాటలు నమ్మినందుకు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని రాజేందర్ మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడే మూసీ సుందరీకరణ ఆలోచన ఎందుకు వచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మూసీ సుందరీకరణపై ఎప్పుడు ఆ ప్రభుత్వాలకు రాని ఆలోచన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
నిర్మాణాలు కూల్చివేసే ముందు స్థానికులు ఎక్కడికి వెళ్లాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల చర్యల వలన స్థానికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెబుతూ అక్కడున్న ఇళ్లను కూల్చివేసే ముందు ప్రభుత్వం స్థానికులకు ప్రత్యామ్నాయాలు చూపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
నార్సింగి నుంచి నాగోలు వరకు మూసీకి ఇరువైపులా ఉన్న ఇళ్లును అధికారులు పరిశీలించి వెళ్లారు. త్వరలో కూల్చివేతలు ఉంటాయని వారు చెబుతున్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలియజేశారు.
More Stories
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం