
వైసీపీ నేత విద్యాసాగర్‌తో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ కుమ్మక్కై పథకం ప్రకారం ముంబయి నటి జెత్వానీ వేధించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నటి జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారని బెయిల్ దొరక్కుండా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ కేసు తెరపైకి వచ్చిన్నప్పటి నుండి పోలీసులకు తప్పించుకొని తిరుగుతున్న కుక్కల విద్యాసాగర్ కోసం రెండు ప్రత్యేక పొలిసు బృందాలు గాలిస్తున్నాయి. చివరకు పోలీసులు డెహ్రాడూన్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైలులో ఆదివారం అర్ధరాత్రి విజయవాడకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్కడి నుంచి సోమవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించడంతో విద్యాసాగర్ ను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోని మిగతా నిందితులకూ అరెస్ట్ భయం వెంటాడుతోంది.
ఈ క్రమంలోనే ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాంతిరాణా టాటా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. అయితే దర్యాప్తునకు కాంతిరాణా సహరించాలని స్పష్టం చేసింది.
తప్పుడు కేసు నమోదు చేసి తనను వేధించినట్లు ముంబయి నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో సెప్టెంబర్ 13న కేసు నమోదు చేసిన పోలీసు.. దర్యాప్తు చేపట్టారు. కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసుల పేర్లు నటి జెత్వానీ ఫిర్యాదులో పేర్కొంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు