
తమ ఆర్ధిక వ్యవస్ధకు వలసలు కీలకమని, కానీ వ్యవస్ధను కొందరు దుర్వినియోగం చేస్తూ విద్యార్ధుల ప్రయోజనాలను పొందినప్పుడు తాము అణిచివేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇక విదేశీ విద్యార్ధుల వీసాలు భారీగా తగ్గిస్తామని ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిలర్ ఇప్పటికే తేల్చిచెప్పారు.
2024తో పోలిస్తే వచ్చే ఏడాది అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై పరిమితి పదిశాతం తగ్గిస్తామని వెల్లడించారు. 2026లోనూ విద్యార్ధి వీసాల పరిస్ధితి నిలకడగా ఉంటుందని ఇది 2023 స్ధాయిలతో పోలిస్తే 36 శాతం తక్కువని తెలిపారు.
మరోవైపు విదేశీ విద్యార్ధులు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నారని, ఇలాగైతే 2024కు నిర్ధేశించిన లక్ష్యాలను దేశం చేరుకోలేదని కెనడాలో యూనివర్సిటీలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం వీసాల కుదింపు ప్రణాళికలతోనే ముందుకెళుతోంది.
కెనడాలో జనాభా విపరీతంగా పెరుగుతుండటంతో గృహాల వ్యయాలు, సేవల వ్యయాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ట్రూడో వలస విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో దిక్కుతోచని స్ధితిలో తాత్కాలిక నివాసితులు, విదేశీ విద్యార్ధులు సహా తాత్కాలిక ఉద్యోగుల వీసాలను కుదించాలని నిర్ణయించింది.
More Stories
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఇరాన్పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్