కఠువా ఎన్​కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

కఠువా ఎన్​కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. అక్కడ వరుసగా ఎన్‌ కౌంటర్లు జరగడం కలవరం రేపుతోంది. తాజాగా కఠువాలో జరిగిన ఎన్​కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత సైన్యం. మరోవైపు కిశ్త్‌వాడ్‌ జిల్లాలో జరిగిన మరో ఎన్​కౌంటర్‌లో నలుగురు సైనికులు గాయ పడ్డారు. 

ఈ విషయాన్ని సైనిక వర్గాలు వెల్లడించాయి. మరి కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లోనే ఈ ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం. కిశ్త్‌ వాడ్‌లోని ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని మొదటగా ఇంటలిజెన్స్‌ నుంచి సమాచారం అందింది. శుక్ర‌వారం రాత్రి ఒక మిలిటెంట్‌ చ‌నిపోగా, శ‌నివారం ఉద‌యం మ‌రో ఇద్ద‌రు హ‌త‌మ‌య్యారు.

ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు చ‌నిపోయిన‌ట్లు క‌శ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్ల‌డించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్ర‌క్రియ‌లో ఉన్న‌ట్లు చెప్పారు. మ‌రోవైపు జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్ర‌ధాని మోదీ ప్ర‌చారం చేప‌ట్ట‌నున్నారు.

దీంతో అప్రమత్తమైన భారత సైన్యం, జమ్ముకశ్మీర్‌ పోలీసులతో కలిసి ఆపరేషన్‌ చేపట్టింది. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఉగ్ర వాదులు ఉన్న ప్రాంతాన్ని సైనికులు గుర్తించారు. అనంతరం భద్రతాదళాలు – ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు గాయపడ్డారు.

వారిని దగ్గర్లోని కమాండ్‌ సెంటర్‌కు తరలించారు. ఉగ్రవాదుల కోసం భద్రత దళాలు ఇంకా వేట కొనసాగిస్తున్నాయి. జులైలో డోడా జిల్లాలో నలుగురు సైనికులు మరణించిన ఘటనలో ఈ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు సైనిక వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు కఠువా జిల్లాలో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు భారత సైనికులు.