విశాఖ‌కు మ‌రో వందేభార‌త్ 14న ప్రధాని ప్రారంభం

విశాఖ‌కు మ‌రో వందేభార‌త్ 14న ప్రధాని ప్రారంభం
విశాఖకు మరో వందేభారత్ రైలు రానుంది. సెప్టెంబ‌ర్ 14న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ దీన్ని ప్రారంభించ‌నున్నారు. ఆ రోజు నుంచే ఈ రైలు అందుబాటులోకి వ‌స్తుంది. అయితే సెప్టెంబ‌ర్ 15న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ‌పూర్ నుంచి విశాఖ‌ప‌ట్నం మ‌ధ్య న‌డుస్తోంది. ఆ త‌రువాత నుంచి దుర్గ్ (ఛ‌త్తీస్‌గ‌ఢ్‌)- విశాఖ‌ప‌ట్నం మ‌ధ్య రాక‌పోక‌లు నిర్వ‌హిస్తోంది.

గురువారం మిన‌హా ప్ర‌తి రోజు ఈ స‌ర్వీస్ అందుబాటులో ఉంటుంది. అంటే వారానికి ఆరు రోజులు ఈ రైలు  విశాఖ‌ప‌ట్నం – దుర్గ్ మ‌ధ్య రాక‌పోక‌లు సాగించనుంది. ఉద‌యం ఆరు గంట‌ల‌కు దుర్గ్‌లో బ‌య‌లుదేరి రాయ‌పూర్‌, ల‌ఖోలి, టిట్లాఘ‌ర్, రాయ‌గ‌డ‌, విజ‌య‌న‌గరం మీదుగా మ‌ధ్యాహ్నం 1.55 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ‌ప‌ట్నం నుంచి మ‌ధ్యాహ్నం 2.55 గంట‌ల‌కు బ‌య‌లుదేరి అదే రోజు రాత్రి 10.50 గంట‌ల‌కు దుర్గ్ చేరుకుంటుంది.

ఈ రైలు బాధ్య‌త‌ల‌ను ఆగ్నేయ మ‌ధ్య రైల్వేలోని రాయ‌పూర్ డివిజ‌న్‌కు అప్ప‌గించారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒరిస్సాలో ఎక్కువ స్టేష‌న్ల‌లో నిలిపేలా ఏపీలో త‌క్కువ స్టేష‌న్ల‌లో ఆగేలా మార్గం ఖ‌రారు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ రైలు ఒరిస్సాలోని రాయ‌గ‌డ త‌రువాత మ‌ధ్య‌లో ఏపీ చెందిన ప్ర‌ధాన స్టేషన్లు ఉన్న‌ప్ప‌టికీ విజయనగరంలో మాత్ర‌మే ఆగుతోంది. ఆ త‌రువాత విశాఖ‌ప‌ట్నంలోనే చివ‌రి స్టాప్ ఉంటుంది.