
ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొనేటప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పా సీనియర్ నేతలు ఎవ్వరూ లేరని ఏలేటి గుర్తు చేశారు. ఏఐసీసీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికి కాకుండా మహేశ్వర్ కుమార్ గౌడ్కు పీసీసీ పదవి కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్ర మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. ఓవైసీ, ముఖ్యమంత్రి సోదరుడి బిల్డింగ్లను కూల్చలేక హైడ్రా కోరలు పికేస్తున్నారని దుయ్యబట్టారు. హైడ్రా ఆరంభ శూరత్వం అయ్యిందని ఎద్దేవా చేశారు.
‘మీరు నిజంగా ఏఐసీసీ పరిధిలో ఉన్నారా? ఏఐసీసీ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా తెలంగాణలో ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ అని చెప్పదల్చుకున్నారా?’ అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు ఒకవైపు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలిస్తే, మరోవైపు పూర్తిగా విరుద్ధంగా పీఏసీ ఛైర్మన్ నియామకాలు చేపట్టారని విస్మయం వ్యక్తం చేశారు. మొత్తం పది ఎమ్మల్యేలపై పార్టీ ఫిరాయింపు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి