కంగనా `ఎమర్జెన్సీ’ చిత్రానికి షరతులతో సెన్సార్ సర్టిఫికెట్

కంగనా `ఎమర్జెన్సీ’ చిత్రానికి షరతులతో సెన్సార్ సర్టిఫికెట్
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సిబిఎఫ్ సి) క్లియరెన్స్‌పై ఎగ్జామినేషన్ కమిటీ ‘యుఎ’ సర్టిఫికేషన్‌ను మంజూరు చేయడంతో ఎట్టకేలకు సద్దుమణిగిన్నట్లు తెలుస్తున్నది. అయితే, చిత్రనిర్మాతలు వివాదాస్పద చారిత్రక ప్రకటనల వస్తావా మూలాలు అందించడంతో పాటు, మూడు కట్‌లు చేయాలని షరతులు విధించినట్లు చెబుతున్నారు.
 
అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను అవమానపరిచే ప్రస్తావనలపై, విన్‌స్టన్ చర్చిల్‌ భారత్ ను చులకనచేస్తూ మాట్లాడిన మాటలపై మూలాలు చూపాలని స్పష్టం చేశారు. ‘యుఏ’ సర్టిఫికేషన్ అంటే సినిమా తల్లిదండ్రుల మార్గదర్శకత్వంతో వీక్షించడానికి అనువుగా ఉంటుందని అర్థం. నిర్మాతలు ఈ చిత్రాన్ని జూలై 8న సర్టిఫికేట్ కోసం సమర్పించారు. వారు దానిని సెప్టెంబర్ 6న విడుదల చేయాలని భావించారు. 
 
అయితే, అకల్ తఖ్త్, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీతో సహా సిక్కు సంస్థలు ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేయడం ప్రారంభించడానికి ముందే సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ అధికారి మణికర్ణిక ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లేఖ వ్రాసారు. ఆగస్టు 8న ‘యుఏ’ సర్టిఫికేషన్ కోసం ఎగ్జామినింగ్ కమిటీకి అవసరమైన 10 మార్పులు, చేర్పులను చూషిస్తూ లేఖ వ్రాసారు. 
 
బంగ్లాదేశ్ శరణార్థులపై పాకిస్తాన్ సైనికులు దాడి చేస్తున్న దృశ్యంలో చిత్రనిర్మాతలు కొన్ని విజువల్స్‌ను తొలగించాలని లేదా భర్తీ చేయాలని కమిటీ సూచించింది. ప్రత్యేకంగా, ఒక సైనికుడు పసికందు తలను పగులగొట్టడం,ముగ్గురు మహిళలలో మరొకరు శిరచ్ఛేదం చేయడం దృశ్యం పట్ల అభ్యంతరం తెలిపారు. 
 
సినిమాలోని ఒక నాయకుడి మరణానికి ప్రతిస్పందనగా, ఒక లైన్‌లో పేర్కొన్న కుటుంబం ఇంటిపేరును మార్చడంతోపాటు, గుంపులో ఎవరో అరిచిన వింత పదాన్ని కూడా భర్తీ చేయాలని చిత్రనిర్మాతలు కోరారను. ఆగస్ట్ 14న సినిమా ట్రైలర్ విడుదలైన రోజుననే ఈ లేఖ పట్ల చిత్ర నిర్మాతలు స్పందించారు. నిర్మాతలు ఒకటి తప్పా మినహా మిగిలిన అన్ని కట్స్‌కు అంగీకరించి, బోర్డు కోరిన సమాచారం మేరకు మూలాధారాలను అందించినట్లు సమాచారం.
 
వేర్పాటువాద ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ప్రత్యేక సిక్కు రాష్ట్రం ఇస్తే ఇందిరా గాంధీ పార్టీకి ఓట్లు వేస్తానని వాగ్దానం చేసిన చిత్రం ట్రైలర్‌పై తీవ్ర స్పందనలు వచ్చాయి. అనేక సిక్కు సంస్థలు సెన్సార్ బోర్డుకు లేఖలు రాశాయి. సిక్కుల చిత్రీకరణపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టులను కూడా ఆశ్రయించాయి.
 
ఆగష్టు 29న, చిత్రానికి యుఏ సర్టిఫికెట్ మంజూరు చేసిన్నట్లు తెలుపుతూ సెన్సార్ బోర్డు నుండి చిత్రనిర్మాతలు ఇమెయిల్‌ను అందుకున్నారు; అయినప్పటికీ, ఎటువంటి సర్టిఫికేట్ జారీ కాకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. దానితో కోర్టు  సెప్టెంబర్ 18లోపు ఓ నిర్ణయం తీసుకోవాలని బోర్డును ఆదేశించింది.