
ఈ సందర్భంగా వారికి భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు. విమానయానం, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాల్సిందిగా సింగపూర్ వ్యాపారవేత్తలను ప్రధాని కోరారు. ఈ నేఫథ్యంలో భారత్‌లో దశలవారీగా రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి.
గత 10 ఏళ్లలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని మోదీ తెలిపారు. “భారత్‌లో రాజకీయ స్థిరత్వం, సులభతర వ్యాపారం. సంస్కరణ-ఆధారిత ఆర్థిక ఎజెండాల్లో మార్పులు తీసుకువచ్చాము. పెట్టుబడి నిధులు, మౌలిక సదుపాయాలు, తయారీ, ఇంధనం, లాజిస్టిక్స్‌తో వంటి వివిధ రంగాల్లో వేగంగా వృద్ధి సాధిస్తున్నాం. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది” అని ధీమా వ్యక్తం చేశారు.
విమానయాన రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్లు తెలిపారు. దేశీయంగా విమానయాన రద్దీని తీర్చడానికి భారతదేశంలో సుమారు 100కు పైగా కొత్త విమానాశ్రయాలు అవసరం ఉన్నాయని వెల్లడించారు. ‘మరిన్ని ఎయిర్‌లైన్ సంస్థలు భారత్‌కు రావాల్సి ఉంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్ ఏదైనా ఉందంటే, అది ఇండియానే” అని ప్రధాని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాలలో సహితం పెట్టుబడులను ఆహ్వానించారు.
భారత్ లుక్ ఈస్ట్ పాలసీకి సింగపూర్‌ను “ముఖ్యమైన ఫెసిలిటేటర్”గా అభివర్ణించిన మోదీ, “ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదేళ్లు పూర్తి కానుంది. గత 10 సంవత్సరాలలో రెండు దేశాల మధ్య వాణిజ్యం రెండింతలు పెరిగింది. పరస్పర పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు పెరిగి 150 బిలియన్ డాలర్లను దాటింది. మేము యూపీఐ పేమెంట్ సదుపాయాన్ని మొదట సింగపూర్‌లోనే ప్రారంభించాం” అని ప్రధాని మోదీ తెలిపారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా