
ఈ వేగం, విస్తృతితో భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ సామర్ధ్యాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వేదాల్లో నిక్షిప్తమైన మంత్రాల్లో అత్యంత ప్రముఖమైనవి సూర్యుడి గురించి ప్రస్తుతించినవి ఉన్నాయని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులు ఈ మంత్రాన్ని పఠిస్తారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులు సూర్యుడిని వారి వారి పద్ధతుల్లో గౌరవిస్తాయని చెప్పారు. పునరుత్పాదన ఇంధనలో ప్యారిస్ ఆశయాలను సాధించిన తొలి జీ20 దేశం భారత్ అని తెలిపారు. సౌర శక్తి రంగంలో తిరుగులేని వృద్ధితోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
సౌరశక్తిని ప్రోత్సహించేందుకు తాము కొద్దినెలల కిందట ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిల్ యోజనను ప్రారంభించామని తెలిపారు. ఈ పధకం కోసం ప్రభుత్వం రూ. 75,000 కోట్లు వెచ్చిస్తోందని చెప్పారు. ఈ పధకంలో భాగంగా కోటి మంది గృహస్ధులు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేందుకు ఊతమిస్తామని తెలిపారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు