
వాంగ్‌తో చర్చలకు ముందు సింగపూర్ పార్లమెంట్ హౌస్ వద్ద మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అక్కడి విజిటర్స్ బుక్‌పై సంతకం కూడా చేశారు. సింగపూర్ కేవలం భాగస్వామ్య దేశమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమని మోదీ పేర్కొన్నారు. తాము కూడా భారత్‌లో అనేక సింగపూర్లను సృష్టించాలనుకుంటున్నామని తెలిపారు. ఆ దిశలో కలిసి పని చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు.
వాంగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల తర్వాత ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ సింగపూర్ రాష్ట్రపతి ధర్మన్ షణ్ముగరత్నంతో భేటీ కానున్నారు. సింగపూర్ వ్యాపారవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సెమీకండక్టర్ల తయారీ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు.
రెండ్రోజుల పర్యటన నిమిత్తం మోదీ బ్రూనై నుంచి సింగపూర్‌కు చేరుకున్నారు. రెండు దేశాల స్నేహబంధాన్ని బలోపేతం చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం తన పర్యటన ఉద్దేశమని చెప్పారు. అపారంగా ఉన్న యువశక్తి, సంస్కరణల కారణంగా భారత్ ఇప్పుడు పెట్టుబడులకు ఆదర్శ గమ్యంగా మారిందని పేర్కొన్నారు.
More Stories
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనాయి తకాయిచి!
ట్రంప్ హెచ్చరికతో బందీలను విడుదలహమాస్ అంగీకారం
దేశద్రోహం లాంటి చట్టాలు ప్రతిఘటనను అణిచేసేందుకే