జ‌యాబ‌చ్చ‌న్ అహంకారాన్ని సూచిస్తుంది

జ‌యాబ‌చ్చ‌న్ అహంకారాన్ని సూచిస్తుంది
ఇటీవ‌ల ముగిసిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో రాజ్య‌స‌భ ఎంపీ జ‌యాబ‌చ్చన్‌ త‌న పేరు విష‌యంలో అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయడం ఆమె అహంకారాన్ని సూచిస్తుందని బిజెపి ఎంపీ, నటి కంగనా ర‌నౌత్ పేర్కొంటూ అదోచిన్న అంశమని కొట్టిపారవేసారు.
 
జ‌యాబ‌చ్చ‌న్ గుర్తింపు కోసం పాకుడలాడ‌డం ఆమె అహంకారాన్ని సూచిస్తున్న‌ద‌ని తన స్వీయ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం `ఎమర్జెన్సీ’ చిత్రం ప్రచారం సందర్భంగా ఎదురైనా ప్రశ్నలకు సమాధానం చెబుతూ కంగ‌నా ఆరోపించారు. ఆ అహంకారం కుటుంబంలోని అంద‌మైన బంధాన్ని కూడా దూరం చేస్తుంద‌ని, మ‌నుషులు ఒక్క‌ర్ని ఒక‌రు ప్రేమించుకోవాల‌ని, కానీ ఇలా క‌ఠిన‌త్వంతో దూరం కావొద్దు అంటూ ఆమె హితవు చెప్పారు.
 
పూర్తి పేరు చెప్ప‌డం వ‌ల్ల కొంద‌రు ఊరికే కోపానికి గుర‌వుతున్నార‌ని, త‌మ గుర్తింపు కోల్పోయిన‌ట్లు బాధ‌ప‌డుతున్నార‌ని కంగ‌నా ఆరోపించారు.  జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్ అంటూ చైర్మెన్ ధ‌న్‌క‌డ్ పిల‌వ‌డాన్ని జ‌యా త‌ప్పుప‌టారు. కేవ‌లం త‌నను జ‌యా బ‌చ్చ‌న్ అని పిలుస్తే స‌రిపోతుంద‌ని ఆమె పేర్కొన్నారు.
 
ఇది సిగ్గుప‌డాల్సిన అంశ‌మ‌ని, పురుషుడు- మ‌హిళ మ‌ధ్య ఉన్న స‌హ‌జ వైరుధ్యాన్ని ఓ వివ‌క్ష‌గా చూస్తున్నార‌ని కంగ‌నా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఫెమినిస్ట్ ఉద్య‌మం త‌ప్పుదోవ‌లో వెళ్తోంద‌ని చెబుతూ  పురుషుడు పురుషుడే అని, మ‌హిళ మ‌హిళే అని, ఇద్ద‌రూ ఒక్క‌టి అవ్వ‌డం అద్భుత‌మ‌ని స్పష్టం చేశారు. 
 
కానీ పార్ల‌మెంట్‌లో జ‌రిగింది ఓ పనికిమాలిన విష‌య‌మ‌ని, ఫెమినిజం పేరుతో ప్ర‌జ‌లు త‌ప్పుడుమార్గంలో వెళ్తున్నార‌ని, స‌మాజం కూడా చెడు మార్గంలో వెళ్తోంద‌ని కంగ‌నా తెలిపారు. కాగా, ఇక్కడ త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అని ఓ  రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ త‌న‌పై వ‌స్తున్న నెగిటివ్ పబ్లిసిటీ కారణంగానే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నట్లు కంగ‌నా చెప్పారు. 
 
అయితే ఎవ‌రిని చేసుకుంటారు రాజ‌కీయ నాయ‌కుడినా.. లేదా న‌టుడినా అన్న ప్ర‌శ్న‌కు సమాధానం ఇస్తూ ఇస్తూ ఎవ‌రిని చేసుకోవాలి అని ఏం లేదు. మ‌న‌సుకు న‌చ్చిన వాడై ఉండాలి అని చెప్పారు. అలాగే పెళ్లిపై కూడా ఎలాంటి ద్వేషం లేదని.. మ‌న‌కంటూ జీవితంలో ఒక భాగస్వామి ఉండాలని ఆమె తెలిపారు. 
 
“అయితే నేను పెళ్లి చేసుకుందాం అంటే నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అందుకే వివాహం చేసుకోలేకపోతున్నా. కోర్టులో కూడా నాపై కేసులు ఉన్నాయి. పెళ్లి అయిన అనంత‌రం కోర్టు కేసు అంటూ పోలీసులు ఇంటికి వ‌స్తే మా అత్తమామలు భ‌య‌ప‌డి పారిపోతారు” అంటూ కంగ‌నా చెప్పుకొచ్చింది.