
కేరళలోని పాలక్కాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూడు రోజులపాటు జరిగే అఖిల భారత సమన్వయ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే మార్గదర్శనం చేస్తున్నారు సంఘ్‌లోని ఆరుగురు సహా సర్కార్యవాహులు, ఇతర అఖిల భారత అధికారులు హాజరవుతున్నారు.
రాష్ట్ర సేవిక సమితి ప్రధాన సంచాలిక శాంతకా జీ, ప్రధాన కార్యవాహక సీతా అన్నదానం, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్, మాజీ సైనిక సేవా పరిషత్ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వి.కె. చతుర్వేది, ఎ.బి.ఎ. గ్రాహక్ పంచాయతీ చైర్మన్ నారాయణ్ భాయ్ షా, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి బజరంగ్ బగ్దా హాజరవుతున్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘటనా కార్యదర్శి ఆశిష్ చౌహాన్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, సంస్థ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, విద్యాభారతి అధ్యక్షుడు డి. రామకృష్ణారావు, భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు హిరణ్మయ్ పాండ్యా, ఆరోగ్య భారతి అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ పండిట్ హాజరవుతున్నారు.
వీరితో పాటు సంఘ్ స్పూర్తితో పనిచేస్తున్న 32 సంస్థల జాతీయ అధ్యక్షులు, సంఘటనా కార్యదర్శులు, ముఖ్య కార్యనిర్వాహకులు, మహిళా ప్రతినిధులతో కలిసి మొత్తం 300 మంది వరకు హాజరవుతున్నారు. ఈ మూడు రోజుల అఖిల భారత సమావేశం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. సమావేశం ప్రారంభంలో, వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం, వాలంటీర్లు చేసిన సహాయ, సేవా కార్యక్రమాల గురించి ప్రతినిధులందరికీ తెలియజేశారు.
సమావేశంలో, వివిధ సంస్థల ప్రతినిధులు తమ కార్యక్రమాల గురించిన సమాచారాన్ని, అనుభవాలను తెలుపుతారు. అంతే కాకుండా, సమావేశంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితులు, ఇటీవలి ముఖ్యమైన సంఘటనలు, సామాజిక మార్పుకు సంబంధించిన ఇతర కోణాలు, జాతీయ ఆసక్తి ఉన్న వివిధ అంశాల సందర్భంలో ప్రణాళికల గురించి చర్చిస్తారు. వివిధ విషయాలపై పరస్పర సహకారం, సమన్వయాన్ని మరింత పెంచడానికి అవసరమైన చర్యలను కూడా అన్ని సంస్థలు చర్చిస్తాయి.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్కు ఎంతో కీలకం