
“మీది పెద్ద దేశం. మీ ప్రభావం కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీరు పుతిన్‌ను, వారి ఆర్థిక వ్యవస్థను ఆపవచ్చు. నిజంగా వారి స్థానంలో వారిని ఉంచవచ్చు” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ లో జరిపిన రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు చమురుకు సంబంధించి భారతదేశం, రష్యా మధ్య చాలా ముఖ్యమైన ఒప్పందాలు ఉన్నాయని జెలెన్స్కీ గుర్తు చేశారు. వారి వద్ద చమురు తప్ప ఏమీ లేదని కూడా చెప్పారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చేస్తున్న నిజమైన యుద్ధాన్ని భారత్ గుర్తించడం ప్రారంభించిందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
More Stories
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్