
బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మాజీ ఎంపీల దౌత్య పాస్ పోర్టులను రద్దు చేసింది. ఈ విషయాన్ని బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దౌత్య పాస్ పోర్టులు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించొచ్చు.
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక ఘటనలకు జడిసి షేఖ్ హసీనా ఆగస్టు 5 నుంచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక పాలన కొనసాగుతున్నది. బంగ్లాదేశ్ లో ఇప్పుడున్న ప్రభుత్వమే దౌత్య పాస్ పోర్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
భాగస్వామ్యులందరితో చర్చించిన అనంతరం హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నాయి. త్వరలో అధికారిక ఆదేశాలను జారీ చేయనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు వెళ్లేందుకు వినియోగించిన దౌత్య పాస్‌పోర్ట్‌ను ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!